Sivaji: అప్పుల్లో కూరుకుపోయిన శివాజీ..ఇంటి రెంట్ కూడా కట్టలేని స్థితి..!

Sivaji.. ప్రముఖ నటుడు శివాజీ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత హీరోగా పలు సినిమాలలో నటించి మెప్పించారు. నటుడిగా ఇటు హీరోగా ఎన్నో సక్సెస్ లు చూసిన ఈయన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి.. రాజకీయాలలో చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఇక తర్వాత గత ఏడాది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.. బిగ్ బాస్ హౌస్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న శివాజీ 90’s వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పేరు దక్కించుకోవడం గమనార్హం. ఒక రకంగా చెప్పాలి అంటే.. ఈ వెబ్ సిరీస్ శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఈ సినిమా తర్వాత పలు వెబ్ సిరీస్ లకి , సినిమాలకి ఓకే చెబుతూ బిజీ అయిపోతున్నారు.. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందట. అదే సమయంలో చిరంజీవి తనకు సహాయం చేశారని.. పైగా తాను అప్పుల్లో కూరుకుపోయినట్లు వార్తలు రాశారా.. ఇలా వీటన్నింటిపై కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చిరంజీవి..

Sivaji:Sivaji is stuck in debt.. he can't even pay the house rent..!
Sivaji:Sivaji is stuck in debt.. he can’t even pay the house rent..!

అప్పుల్లో కూరుకుపోయిన శివాజీ..

మాస్టర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవికి నేను వీరాభిమానిని.. ఆయనకు నేను ఒక అభిమానిగా , ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు. ఫుల్ జోష్ లో షూటింగ్ జరుగుతోంది.. అప్పుడు నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు.. చాలా ఇబ్బంది పడ్డాను.. నేను డబ్బులు లేనప్పుడు కూడా ఈ విషయం ఎవరితో చెప్పకుండా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉండేవాడిని.. కానీ ఈ విషయం ఎవరో చిరంజీవితో చెప్పారు.. షూటింగ్ అయ్యాక చిరంజీవి నా దగ్గరకు వచ్చి ₹10,000 ఇచ్చారు.. ఎందుకు.. వద్దు.. అని అంటున్నా సరే.. ఆయన నా చేతిలో డబ్బు పెట్టి వెళ్లిపోయారు.. ఇక ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రెంట్ కి ఇబ్బంది కలగలేదు.. అయితే అప్పటికే నేను ఆయనకి పెద్దగా తెలియదు.. కానీ ఆ సినిమాలోనే పరిచయమైనా నా కోసం ఆయన డబ్బు సాయం చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అంటూ శివాజీ వెల్లడించారు.. అయితే మళ్లీ సినిమాలలోకి వచ్చి ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు నేను అప్పుల్లో కూరుకుపోయాను అంటూ వార్తలు ప్రచారం చేశారు.. ఆ తర్వాత నాకు ఎప్పుడూ కూడా అలాంటి ఇబ్బందులు కలగలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు శివాజీ.

శివాజీ రాజకీయ జీవితం..

మొదట శివాజీ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంతో ఖుషి చేశారు. విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించారు.. హోదా ఇవ్వనందుకు సొంత పార్టీ భాజాపాను కూడా విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3న గుంటూరులో 48 గంటల నిరాహార దీక్ష కూడా చేసిన ఘనత ఈయన సొంతం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు