Kalki2898AD : ఎట్టకేలకు అశ్వద్దాముడి ఆగమనం..

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘కల్కి2898AD’ మూవీ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పాత్రకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కళ్ళతో కూడిన ఫస్ట్ లుక్ తప్ప మరేది రిలీజ్ చేయలేదు. ఇక ఎప్పటి నుంచో ఈ చిత్రంలో అమితాబ్ లుక్, పాత్ర స్వ‌భావం గురించి తెలుసుకోవాల‌ని దాని వివరాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి క్యూరియాసిటీకి త‌గ్గ‌ట్టుగానే, ఈ సినిమా నుంచి నిన్న ఒక కొత్త పోస్టర్ రిలీజ్ కాగా, ఆ పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి ఒక ఆలయం లోపల కూర్చుని, ప్రకాశవంతమైన కాంతి కిరణం వైపు చూస్తూ క‌నిపించారు. ఈ పోస్ట‌ర్ లో అమితాబ్ రూపాన్ని చూడ‌గానే ఆయ‌న ఆయన ఒక స‌న్యాసి అని అనుకున్నారు ఆడియన్స్. ఇక ఆ ఆల‌య ప్రాంగ‌ణం సాలె గూళ్ల‌తో ఉండగా అత్యంత పురాత‌న‌మైన‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ పోస్ట‌ర్ ద్వారా అస‌లు ఆ సన్యాసి ఎవరా అన్న ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది 21 ఏప్రిల్ 7.15 PM లకు రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా, తాజాగా దానికి సంబంధిచిన టీజర్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో రిలీజ్ అయింది.

అశ్వద్ధామ గా అమితాబ్..

అయితే తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ పూర్తి సన్యాసి గా లుక్ లో దర్శనమివ్వగా పవర్ ఫుల్ గా కనిపించాడు. గుడి పక్కన ఉన్న చిన్న పిల్లాడు వచ్చి మీరు ఎవరు అని అడిగితే ద్రోణాచార్య పుత్రుణ్ణి అశ్వద్ధామ ని అని చెప్తాడు. అశ్వద్ధామ అంటే మహాభారతంలో కురు వీరుల గురువు దృణచార్యుడి కుమారుడు. మహా భారత యుద్ధాన్ని మొత్తం ఒక్కరోజులో ముగించగల సమర్ధుడితను. ఈయన సప్త చిరంజీవులలో ఒకడిగా ప్రసిద్ధి. ఇలాంటి పాత్రను కల్కి 2898AD మూవీ లో నాగ్ అశ్విన్ తీసుకొచ్చాడంటే సాహసమనే చెప్పాలి. అయితే టీజర్ లో అశ్వద్ధామ యంగ్ లుక్ లో అభిషేక్ బచ్చన్ ఉన్నటు అనిపిస్తుంది. ఏది ఏమన్నా కల్కి ఫ్యాన్స్ కి ఇది సాలిడ్ ట్రీట్ అని చెప్పాలి.

ఇక నుండి రెగ్యులర్ గా ప్రమోషన్..

ఇక తాజాగా రిలీజైన కల్కి2898AD అమితాబ్ బచ్చన్ టీజర్ సంబంధించి పాన్ ఇండియా వైడ్ గా వైరల్ అవుతుంది. త్వరలో వెలువ‌డ‌నున్న‌ రిలీజ్ డేట్ ప్రకటన కోసం నిరీక్షణను పెంచింది. కల్కి 2898 AD గత సంవత్సరం శాన్ డియాగో కామిక్-కాన్‌ లో సంచలనాత్మక అరంగేట్రం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. క‌ల్కి 2898 AD చాలా భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఇది భవిష్యత్ ప్రపంచం ఎలా ఉండ‌బోతోందో ఆవిష్క‌రించే చిత్ర‌మ‌ని ద‌ర్శ‌కుడు వెల్ల‌డించారు. ఇక ఇప్పటినుండి మూవీ యూనిట్ నుండి రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ చేయనున్నారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు