Rajinikanth: తలైవా ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యూజులు అవుట్..!!

Rajinikanth: ఇండియన్ సినీ సెలబ్రిటీలలో తనకంటూ ఒక సపరేట్ స్టైల్ మైంటైన్ చేస్తున్న హీరోలలో సూపర్ స్టార్ రజినీకాంత్ మొదటి వరుసలో ఉంటారు.. ముఖ్యంగా తన స్టైల్ మేనరిజం తో అభిమానులను బాగా అలరిస్తూ ఉంటారు రజినీకాంత్. అందుకే సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నప్పటికీ రజినీకాంత్ గురించి చాలామంది ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బస్ డ్రైవర్ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శం.. తమిళంలో సహ దేశవ్యాప్తంగా భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడుగా రజనీకాంత్ పేరు సంపాదించారు.

Rajinikanth:If the value of Thalaiva's assets is known in crores, the fuses are out..!!
Rajinikanth:If the value of Thalaiva’s assets is known in crores, the fuses are out..!!

రజినీకాంత్ రెమ్యునరేషన్..

తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ఏ పాత్ర కైనా ప్రాణం పోసి మరీ నటిస్తూ ఉంటారు రజినీకాంత్.. అందుకే భారతదేశంలో రజనీకాంత్ కు ఇంత గొప్ప ఆదరణ ఉందని చెప్పవచ్చు. ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నటులలో ఒకరిగా రజనీకాంత్ పేరు సంపాదించారు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూనే సినిమాల లాభాలలో వాటా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతటి రెమ్యునరేషన్ తీసుకుంటున్న రజనీకాంత్ ఆస్తి విలువ తెలుసుకోవడానికి అభిమానులు చాలా కుతూహలంగా ఉన్నారు.

రజినీకాంత్ నికర ఆదాయం..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రజనీకాంత్ నికర ఆస్తి విలువ సుమారుగా రూ.480 కోట్లు ఉన్నట్లు సమాచారం.. ఎన్నో ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 110 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే లాభాలలో కూడా వాటాలు తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. జైలర్ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. వీటితోపాటు రజనీకాంత్ తన కెరీర్ లో వచ్చిన డబ్బులను ఎన్నో మార్గాలలో పెట్టుబడులు పెట్టారట. దీని ద్వారా కూడా భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

సంపాదనే కాదు సహాయం కూడా..

చెన్నై ఇతరత్రా ప్రాంతాలలో కూడా కొన్ని కోట్ల విలువ చేసే భూములు, ఇల్లు రజనీకాంత్ నిర్మించుకున్నారట. రజినీకాంత్ పేరిట ఒక కళ్యాణ మండపమే ఉందని సమాచారం. అలాగే నాలుగు అత్యధిక ఖరీదైన కార్లు ఉన్నాయి. సహాయం చేయడంలో కూడా రజనీకాంత్ ని మించిన వారు ఎవరూ లేరని కూడా చెప్పవచ్చు.. కొన్ని సందర్భాలలో కొంతమంది హీరోలు అప్పుల్లో ఉన్నా పలు సినిమాలను తెరకెక్కిచ్చే సందర్భంలో రెమ్యూనరేషన్ తీసుకోకుండానే నటించే వారట. ముఖ్యంగా మోహన్ బాబు మంచి స్నేహితుడు కావడం చేత ఆయన సినిమాలలో ఎక్కువగా నటించినట్టు సమాచారం.

రజినీకాంత్ సినిమాలు..

రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆ తర్వాత లాల్ సలాం సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా విజయాన్ని అందుకోలేదు.. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు రజినీకాంత్.. పక్కపక్క సినిమాలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును పేదలకు కూడా పంచి పెడుతూ తన మంచి మనసుని చాటుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు