Game Changer : అంజలికి ఈ క్యారెక్టర్ నుండి బైటికి రావడానికి చాలా టైం పట్టిందట

Game Changer : టాలీవుడ్ హీరోయిన్ తెలుగమ్మాయి అయిన అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగమ్మాయి అయిన అంజలి ముందుగా తెలుగులో పరిచయమైనా, గుర్తింపు మాత్రం తమిళ్ లో తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలతో మంచి ఫేమ్ సంపాదించి బిజీ అయింది. ఎంతో టాలెంట్ ఉన్న నటీమణుల్లో అంజలి ఒకరు. అయితే అంజలి కోలీవుడ్‌ సినిమాలతో హీరోయిన్‌ గా పాపులారిటీని సొంతం చేసుకున్నా, తెలుగు లో మాత్రం పెద్దగా స్టార్ డమ్ దక్కలేదు. అప్పట్లో అంజలి సినిమాలను తెలుగు ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ ఇప్పటి లైట్‌ గానే తీసుకునే వారు. కానీ ఇక నుంచి అంజలి సినిమాలకు తెలుగు మార్కెట్‌ లో ఖచ్చితంగా మంచి మార్కెట్‌ ఉండటంతో పాటు, ఆమె నటించబోతున్న సినిమాలకు కూడా మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా ‘గేమ్‌ చేంజర్’ వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయట. తాజాగా అంజలి ఓ ఇంటర్వ్యూ లో గేమ్ ఛేంజర్ గురించి తన పాత్ర గురించి మీడియా తో షేర్ చేసుకుంది.

కెరీర్ బెస్ట్ రోల్ లో అంజలి..

అయితే అంజలి రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో రెండో హీరోయిన్ గా నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ పాత్ర అయిన అప్పన్న కి జోడిగా నటిస్తుంది. అయితే అంజలి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ లో సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌, శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘గేమ్‌ చేంజర్’ లో అంజలి కనిపించేది కొద్ది సమయం మాత్రమే అయినా కూడా మెయిన్‌ హీరోయిన్ కియారా పాత్రను డామినేట్‌ చేసే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో చరణ్ కు జోడీగా అంజలి కనిపించబోతుంది. ఆ మధ్య అంజలి గెటప్‌ మరియు చరణ్‌ తో ఆమె ప్రజెన్స్‌ ను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. చరణ్‌ రెండో పాత్రకు ఖచ్చితంగా ఆమె సరి జోడీ అనడంలో సందేహం లేదు. గేమ్‌ చేంజర్ సినిమా తర్వాత అంజలి క్రేజ్ టాలీవుడ్‌ లో రెట్టింపు అవ్వడం ఖాయమని అనిపిస్తుంది. ఇక గేమ్‌ చేంజర్ లో అంజలి పోషిస్తున్న పాత్ర సినిమాకు అత్యంత కీలకం కానుండగా, సినిమా విడుదల తర్వాత అంజలి టాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వడం ఖాయమని ఆ పాత్ర గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇక ఇలాంటి పాత్రలు కేవలం అంజలి మాత్రమే చేయగలదు అన్నంత స్థాయిలో ఈ పాత్రలో ఆమె నటన ఉంటుందని కూడా యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

ఆ క్యారెక్టర్ నుండి బైటికి రావడానికి టైం పట్టింది..

తాజాగా అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆ పాత్ర గురించి మాట్లాడుతూ ఇలా అంది. నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నేను చేసిన వాటిలో ఇదే టఫ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. అయితే గేమ్ ఛేంజర్ లో నేను చేసిన ఇలాంటి పాత్ర వేరే వాళ్ళు ఎవరూ కూడా చేయలేదు. అంతే కాదు నేను షూటింగ్ ముగిశాక ఇంటికి వచ్చాక ఆ క్యారెక్టర్ నుండి బయటికి రావడానికి చాలా టైం పట్టింది అని చెప్పింది. ఓవరాల్ గా తాను ఇప్పుడు చేసిన పాత్రల్లో ఎక్కువ ఎఫెక్ట్ చేసిన క్యారెక్టర్ ఇదేనని చెప్పింది. ఇక అంజలి వ్యాఖ్యలతో గేమ్ చేంజర్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. అయితే సినిమా నుండి దాదాపు నెలరోజులుగా మరో అప్డేట్ కూడా రాలేదు. ఫ్యాన్స్ ఈ సినిమా నుండి రెండో సాంగ్ గాని, లేదా గ్లిమ్ప్స్ గాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు