Kalki2898AD : అశ్వద్ధామ అంటే ఎవరో తెలుసా.. ఆ పాత్రనే ఎందుకు తీసుకున్నారు?

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘కల్కి2898AD’ మూవీ గురించి అభిమానులు ఎంత ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భారీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా భారీ తారాగణం నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ తో ఈ సినిమా రేంజ్ కూడా మారిపోయింది. అయితే ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రభాస్ ఫర్స్ట్ లుక్ చూసి కంగారు పడిన ఫ్యాన్స్, ఆ తర్వాత టీజర్ తో చల్లబడ్డారు. ఇక అప్పటినుండి కల్కి నుండి వస్తున్న ఒక్కో అప్డేట్ కోసం ఫ్యాన్స్ తో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రకి సంబంధించి తాజాగా ఓ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్ లో అమితాబ్ బచ్చన్ పాత్ర పేరు అశ్వద్ధామ గా రివీల్ చేసారు మేకర్స్.

అశ్వద్ధామ గా అమితాబ్..

రిలీజ్ చేసిన టీజర్ (Kalki2898AD) లో గుడి పక్కనే ఉన్న చిన్న పిల్లాడు వచ్చి, మీరు ఎవరు, మీరు చావు లేదా? దేవుడివా, రాక్షసుడివా అని అడుగుతుంటే .. అతను చాలు సమయం వచ్చింది.. ఇది అంతిమ యుద్ధ సమయం.. అంటూ తాను ద్రోణాచార్యుడి పుత్రుణ్ణి అశ్వద్ధామని చెప్తాడు. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న ఈ టీజర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ తో కూడిన మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని తెలిసిందే. అందుకే పురాణ పురుషుల పాత్రలు ఇందులో వస్తున్నాయి. ఇక ప్రభాస్ శ్రీ మహా విష్ణువు పదకొండో అవతారమైన కల్కి గా కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ టీజర్ తో ఆ పాత్ర గురించి అందరికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అశ్వద్ధామ పేరు వినడమే గాని, మహాభారతంలో ఉంటాడని కొన్ని కొన్ని విషయాలు తప్ప పెద్దగా ఎవరికీ తెలీవు. మరి ఆ పాత్రని కల్కి సినిమాలో ఎందుకు తీసుకున్నారో అశ్వద్ధామ గురించి తెలుసుకుంటే అర్ధమైపొద్ది.

ద్రోణాచార్యుడి కుమారుడు.. మహాభారత వీరుడు..

ఇక అశ్వద్దాముడి పాత్ర హైందవ ఇతిహాస గాథల్లో మహాభారతం లో ఉంటుంది. మహాభారతం లో మహాభారతంలో కురు వీరుల (కౌరవులు, పాండవులు) గురువైన ద్రోణాచార్యుడి కుమారుడే ఈ అశ్వద్దాముడు. మహా భారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన ఇతను యుద్ధం చివరి దాకా ఉంటాడు. అంతే కాదు కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవుల నుండి గెలిపించే యోధుల్లో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వీరి తర్వాత అంతటి సామర్ధ్యం అశ్వద్ధామకే ఉంది. అయితే శ్రీ కృష్ణుడి సహాయంతో పాండవులు ధర్మ యుద్ధం చేసి గెలిచారు. ఇక పాండవులు మహాభారతం ముందు ద్రుపదుడిని ఓడించి అతని నుండి సగం రాజ్యం తీసుకుని అశ్వద్ధామ ని రాజుని చేస్తారు. అయితే అశ్వద్ధామ మాత్రం దుర్యోధనుని మైత్రి ని ఆశిస్తాడు. అందుకే కౌరవుల వైపు తండ్రి కొడుకులు నిలబడతారు. ఇక మహాభారత యుద్ధంలో భీష్మ, ద్రోణాచార్య, కర్ణులు సహా మరణించాక, దుర్యోధనుడు కూడా ఓడిపోయాక, స్నేహితుడైన దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం, అశ్వద్ధాముడు యుద్ధం ముగిసాక పాండవులను చంపడానికి వెళ్లి కొడుకులను ఉపపాండవుల్ని చంపేస్తాడు.

- Advertisement -

ఇది గమనించిన అర్జునుడు అశ్వద్ధామని చంపడానికి బాణం సంధిస్తుంటే, కోపంతో అశ్వద్ధామ పాండవుల వంశాకురం అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్ ని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దీనికి ప్రతిగా అర్జునుడు కూడా మరో బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అడ్డుకుని ఒకేసారి రెండు బ్రహ్మాస్త్రాలు ఢీ కొంటే సృష్టి అంతరిస్తుందని, మహాభారతం జరిగి వృధా అని ఇద్దర్ని ఆ అస్త్రాల్ని ఉపసంహరించుకోమంటాడు. అయితే అర్జునుడు వెనక్కి తీసుకున్నా అశ్వద్ధముడు తీసుకోక ఉత్తర గర్భం పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు గర్భంలో ఉన్న శిశువు మరణించినా, శ్రీ కృష్ణుడు తన మాయా శక్తితో బతికిస్తాడు. అయితే శ్రీ కృష్ణుడు ఆగ్రహంతో అశ్వద్ధామని సంహరించకుండా సృష్టి అంతమయ్యే క్షణం వరకు భూమి మీద కురూపిగా, కుళ్ళి కృశించిపోయి బతకమని శపిస్తాడు. ఇప్పటికీ ఈ భూమి మీద అశ్వద్దామ ఉన్నాడని అంటారు పెద్దలు. ఇక సప్త చిరంజీవుల్లో ఒకరని కూడా అంటారు. అందుకే ఈ కల్కి2898AD మూవీ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాత్రని తీసుకున్నాడు. మరి ఆ పాత్ర ని ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు