Kalki2898AD : ప్రభాస్ శ్రీ మహావిష్ణువైతే, ఆ రెండు పాత్రల్లో ఈ కనిపించేది ఈ హీరోలేనా?

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘కల్కి2898AD’ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చుంటుంది. ఇక కల్కి2898AD టీజర్ తో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసిన దర్శకుడు తాజాగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో అమితాబ్ పాత్ర మహాభారతంలోని అశ్వద్ధామ పాత్ర అని రివీల్ చేసిన దర్శకుడు సినిమాపై మరింత అంచనాలని పెంచేసాడు, ఇక ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా అని తెలిసిందే. దానికి తగ్గట్టే కల్కి సినిమా తెరకెక్కుతుంది. ఇక కల్కి లో ప్రభాస్ శ్రీ మహా విష్ణువు 11 వ అవతారం కల్కి గా కనిపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ సహా త్రిమూర్తులు గా ఆ యంగ్ స్టార్స్..

ఇక కల్కి మూవీ లో ప్రభాస్ పాత్ర పేరు భైరవ అని మేకర్స్ రివీల్ చేయగా, ప్రభాస్ శ్రీ మహా విష్ణువు కల్కి పాత్రలో కనిపిస్తాడని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి కాబట్టి, రెండు పాత్రలు కూడా ఉన్నాయని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం మీద సినిమా మీద అంచనాలను అయితే ఓ రేంజ్ లో పెంచేసింది అనే చెప్పాలి. ఇక లేటెస్ట్ గా సినిమా కి సంభందించిన మరో ఆసక్తి కరమైన వార్త ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఆ వార్తల ప్రకారం సినిమాలో కొన్ని స్పెషల్ క్యామియోలు కూడా ఉండబోతున్నయట. ఆ వార్తల ప్రకారం సినిమాలో స్పెషల్ క్యామియో రోల్స్ లో టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ, అలాగే మలయాళ ఇండస్ట్రీ నుండి దుల్కర్ సల్మాన్ కల్కి సినిమాలో స్పెషల్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యంగ్ హీరోలు ప్రభాస్ తో కలిసి త్రిమూర్తులు గా కనిపించబోతున్నారట. ప్రభాస్ కల్కి గా శ్రీ మహావిష్ణువు అయితే, బ్రహ్మ, మహేశ్వరులుగా విజయ్, దుల్కర్ అన్నమాట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు గాని, గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.

రిలీజ్ డేట్ నాటికి మరింత రచ్చ..

ఇక ఈ వార్త ఇండస్ట్రీ మొత్తం చక్కర్లు కొడుతూ ఉండగా, ఈ ఇద్దరు హీరోలు కూడా నాగ్ అశ్విన్ తో మహానటి మూవీ చేసి ఉండటంతో వీళ్ళ స్పెషల్ క్యామియోలు సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఇదే కనుక జరిగితే ఆల్ రెడీ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న కల్కి (Kalki2898AD) సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర ఇండస్ట్రీలలో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోగా, కల్కి సినిమాలో ఇతర ఇండస్ట్రీల స్టార్స్ కూడా యాడ్ అవడంతో భారీ కలెక్షన్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. ఇక కల్కి2898AD జూన్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు