Re Release Movies : రీ రిలీజుల్లో ఆ 10 కోట్లు కొల్లగొట్టి ఆ చిత్రాల సరసన నిలిచిన గిల్లి..!

Re Release Movies : టాలీవుడ్ తో పాటు గత కొన్నాళ్లుగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ నుండి, ఇప్పటి స్టార్స్ దాకా, మీడియం రేంజ్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో ఏకంగా డబ్బింగ్ సినిమాలను కూడా రీ రిలీజ్ లో ఆదరించడం తెలుగు ఆడియన్స్ కే చెల్లింది. ఇక ఇప్పుడు రీ రీలీజ్ మూవీస్ (Re Release Movies) ట్రెండ్ కోలీవుడ్ కి కూడా పాకగా, ఈ మధ్యనే రజినీకాంత్ నటించిన బాషా, నరసింహ చిత్రాలు రీ రిలీజ్ కాగా, మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇక అలాగే సూర్య సన్ అఫ్ కృష్ణన్, రఘువరన్ బిటెక్ కూడా రీ రిలీజ్ లో మంచి వసూళ్లనందుకున్నాయన్న సంగతి తెలిసిందే. ఇకపోతే రీసెంట్ గా తలపతి విజయ్ నటించిన గిల్లి సినిమా ఏకంగా ఇండియా మొత్తంలో భారీ ఎత్తున కొత్త సినిమాల రేంజ్ లో రీ రిలీజ్ అయి భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది.

రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డు..

తలపతి విజయ్ నటించిన సినిమా గిల్లి మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీకి రీమేక్ అని తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో గిల్లి సినిమాను ఏప్రిల్ 20వ తేదీన చాలా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. ఒక్క చెన్నై లోనే 300కు పైగా షోలు వేశారంటేఈ సినిమాకి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రీ రిలీజ్ లో గిల్లి సినిమా ఏకంగా అల్ టైం రికార్డు కొట్టింది. అయితే రీ రిలీజ్ అయిన సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసిన ఈ సినిమా, తెలుగు వర్షన్ ఇచ్చినంత ఎక్సైట్మెంట్, గాని గ్రాండియర్ నెస్ తమిళంలో కనిపించదు. అయినా సరే విజయ్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక అప్పట్లో విజయ్ కి గిల్లి సినిమా భారీగా కెరియర్ గ్రాఫ్ ను పెంచేసింది. ఇక రీ రిలీజ్ అయ్యాక తొలిరోజు అల్ టైం రికార్డు ఓపెనింగ్స్ గిల్లి తెచ్చుకోగా తమిళ నాడు లో 4.35 కోట్లు, కేరళ లో కర్ణాటక లో 30 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా లో 22 లక్షలు, రాబట్టగా, ఓవర్సీస్ లో ఏకంగా 3.05 కోట్లు వసూలు చేసింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా 7.92 కోట్ల గ్రాస్ ని రాబట్టి అల్ టైం రికార్డు సృష్టించింది. అయితే కొందరు 10 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిందని ప్రచారం చేసినా అది రెండో రోజుతో సాధ్యమయింది. ఇక రెండు రోజుల్లో గిల్లి మూవీ 12.15 కోట్లు వసూలు చేసి రీ రిలీజ్ సినిమాల్లో అల్ టైం రికార్డు సృష్టిందింది.

రీ రిలీజ్ లో 10 కోట్లకి పైగా కొల్లగొట్టిన చిత్రాల సరసన గిల్లి..

ఇక టాలీవుడ్ మూవీస్ కాకుండా ఇండియా వైడ్ గా రీ రిలీజ్ ద్వారా 10 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన గిల్లి కూడా నిలిచింది. ఇంతకు ముందు బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ అయిన “షోలే” 2013 రీ రిలీజ్ అయ్యాక 10 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించగా, అంతకు ముందే టైటానిక్ కూడా 2012 లో రీ రిలీజ్ అయి పది కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ అవతార్ 2 రిలీజ్ సందర్బంగా ఫస్ట్ పార్ట్ అవతార్ ఇండియాలో భారీ ఎత్తున రీ రిలీజ్ కాగా, ఈ చిత్రం కూడా పది కోట్లకి పైగా కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఆ చిత్రాల సరసన విజయ్ గిల్లి నిలవడం విశేషం. ఇక లాంగ్ రన్ లో విజయ్ గిల్లి 15 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు