Vijay deverakonda: బాడీగార్డ్ పెళ్లిలో కత్తి పట్టిన రౌడీ హీరో… ఫోటోలు వైరల్..!

Vijay deverakonda.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ తనతో కలిసి పనిచేసే వారికి.. అలాగే తన కింద పనిచేసే వాళ్ళకి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారో అందరికీ తెలిసిందే… ఈ క్రమంలోనే తాజాగా తన దగ్గర పని చేసే బాడీగార్డ్ పెళ్లి పీటలెక్కారు.. ఆయన విజయ్ దేవరకొండ తో పాటు కుటుంబం మొత్తం తన పెళ్లికి రావాలని ఆహ్వానించగా.. విజయ్ దేవరకొండ అతని పిలుపు మేరకు కుటుంబంతో కలిసి అక్కడికి చేరుకున్నారు.. తన దగ్గర పని చేసిన బాడీగార్డ్ పెళ్లిలో కుటుంబంతో సహా దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.. అంతేకాదు ఆ బాడీగార్డ్ పెళ్లిలో కత్తి కూడా పట్టారు..

Vijay deverakonda: The rowdy hero who wielded a knife at the bodyguard's wedding... Photos goes viral..!
Vijay deverakonda: The rowdy hero who wielded a knife at the bodyguard’s wedding… Photos goes viral..!

బాడీగార్డ్ పెళ్లిలో కత్తి పట్టిన విజయ్ దేవరకొండ..

తన బాడీ గార్డ్ పెళ్లికి విజయ్ దేవరకొండ కుటుంబంతో సహా వెళ్లగా అక్కడ వరుడి కుటుంబ సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండకు కత్తిని బహుకరించారు.. ఆ కత్తి పట్టుకొని విజయ్ దేవరకొండ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

విజయ్ దేవరకొండ సినిమాలు..

ఇటీవల ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్లాప్ చూసిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాల మేరకు ఈ సినిమా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

- Advertisement -

విజయ్ దేవరకొండ కెరియర్..

ఒకప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చారు. అందులో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ మహానటి సినిమాలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు .. ఈ సినిమా ద్వారా యువతలో విపరీతమైన క్రేజ్ లభించింది. ఈ సినిమా తర్వాత చేసిన గీతాగోవిందం సినిమా కూడా విజయ్ దేవరకొండకు మంచి విజయాన్ని అందించిందని చెప్పవచ్చు. తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ ద్వారకా, టాక్సీవాలా వంటి సినిమాలు మాత్రం. పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా చిత్రంగా లైగర్ సినిమాతో వచ్చారు. కానీ ఈ సినిమా కూడా ఘోర పరాభవాన్ని చూపించింది. తర్వాత వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించినా.. మళ్లీ ఫ్యామిలీ స్టార్ సినిమా బోల్తా పడింది.. అందుకే ఈసారి ఎలాగైనా గౌతమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు విజయ్ దేవరకొండ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు