Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఆస్తులే కాదు అప్పులు కూడా ఉన్నాయా..ఎన్ని కోట్లంటే..?

Pawan Kalyan: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఆస్తులే ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పులు కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి కూడా అప్పులు ఉన్నాయా అంటూ అటు ప్రజలు ఇటు అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది.. ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తూ..సమర్పించే ఎన్నికల అఫిడవిట్ చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తూ ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు.. ఇక ఇందులో తనకు ఎంత ఆస్తి ఉంది? ఎంత అప్పు ఉంది? అన్న విషయాన్ని కూడా వెల్లడించారు..

Pawan Kalyan: Does Pawan Kalyan not only have assets but also debts..how many crores..?
Pawan Kalyan: Does Pawan Kalyan not only have assets but also debts..how many crores..?

పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పులు..

తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న సమాచారం మేరకు… తన ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు.. ఇక ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు, అలాగే రూ.20 కోట్లకు పైగా విరాళాలు అందజేసినట్లు వెల్లడించారు.. ఇక అప్పుల విషయానికి వస్తే.. రూ .64.26 కోట్ల అప్పులు ఉన్నాయంటూ ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచారు..

ఐదేళ్లలో సంపాదన , అప్పుల పూర్తి వివరాలు..

ఇకపోతే పవన్ కళ్యాణ్ గత ఐదు సంవత్సరాల లో రూ.114,76,78,300 సంపాదించినట్లు సమాచారం. ఇక ఇందుకు సంబంధించిన ఆదాయపు పన్ను రూ.47,07,32,875, జీఎస్టీ రూ.26,84,70,000 చెల్లించారు.. అలాగే రూ.64,26,84,453 అప్పులు ఉన్నట్లు కూడా పొందుపరిచారు.. ఇక ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 రుణాలు తీసుకోగా.. రూ.46,70,00,00 ఇతరుల దగ్గర అప్పుగా తీసుకున్నట్లు సమాచారం..

- Advertisement -

భారీగా విరాళాలు..

జనసేనాని పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు అలాగే పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం కూడా విరాళాలు అందించారు.. ఇందులో జనసేన పార్టీ కోసం రూ.17,15,00,000 విరాళాలు ఇచ్చారు.. ఇక పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా వేరు వేరు సందర్భాలలో కూడా విరాళాలు ఇచ్చినట్లు పొందుపరిచారు.. ఇక అంతేకాదు వివిధ సంస్థలకు రూ.3,32,11,717 విరాళంగా ప్రకటించారు.. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఫండ్ కి రూ. 1 కోటి, కేంద్రీయ సైనిక బోర్డు కోసం రూ.1 కోటి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం రూ.50 లక్షలు అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోసం రూ.30,11,717, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కోసం రూ .2 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు..

ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల ఆయన నటిస్తున్న సినిమాలను వాయిదా వేశారు. అందులో OG, ఉస్తాద్ భగత్ సింగ్ , హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన సార్వత్రికఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇవి పూర్తయిన వెంటనే తిరిగి మళ్ళీ ఆయన షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు