Zwigato on OTT : అవార్డు విన్నింగ్ కపిల్ శర్మ మూవీ… రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి

Zwigato on OTT : బాలీవుడ్ పాపులర్ కమెడియన్, టాప్ టీవీ హోస్ట్ కపిల్ శర్మ ప్రధానపాత్రలో నటించిన జ్విగాటో అనే మూవీ ఓటిలోకి రాబోతోంది. నందిత దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2022లో రిలీజ్ కాగా ఫిలింఫేర్ తో పాటు పలు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. టొరెంట్ తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ కు అవకాశం దక్కించుకున్న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తుండడం విశేషం. అంతేకాదండోయ్ ఆస్కార్ లైబ్రరీలో సైతం మూవీకి స్థానం దక్కింది.

ఏ ఓటీటీలో, ఎప్పుడు?

జ్విగాటో మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి కపిల్ శర్మ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోగా, మేలో జ్విగాటో మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోందని టాక్ నడుస్తోంది. రిలీజ్ డేట్ పై ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ మే 3 లేదా 10 నుంచి జ్విగాటో మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.

ఏంటి ఈ వింత టైటిల్?

జ్విగాటో అనగానే అందరికీ జొమాటో గుర్తొస్తుంది. సాధారణంగా కొన్ని బ్రాండ్స్ నేమ్ ను  సినిమాల్లో వాడుకోవడానికి ఒప్పుకోరు. అందుకే ఇలా చిన్నచిన్న వర్డ్స్ మార్చి టైటిల్ ను  ఛేంజ్ చేస్తారు. ఇక ఈ మూవీకి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్ జొమాటో పేరును ముందుగా అనుకున్నారు. కానీ తమ సంస్థ పేరుతో సినిమా తీయడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో టైటిల్ ను జ్విగాటో అని మార్చుకున్నారు. అయితే ఇన్ని అవార్డులు అందుకున్న ఈ మూవీ ఊహించినంతగా సక్సెస్ మాత్రం కాలేదు. దానికి టైటిల్ కూడా ఒక కారణమే. ఇక ఈ మూవీలో సహన గోస్వామి హీరొయిన్ గా కనిపించింది.

- Advertisement -

వివాదాలు తక్కువేం కాదు..

ఈ సినిమాలో కపిల్ శర్మ ఫుడ్ డెలివరీ బాయ్ గా నటించిన మెప్పించాడు. కానీ ఈ మూవీ ఓటిటి రైట్స్ విషయంలో నిర్మాతలకు ఇబ్బందులు తప్పలేదు. సినిమాలో ఫుడ్ డెలివరీ సంస్థలకు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉండడంతో జ్విగాటో డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేయడానికి ఒక్క ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదు. అయితే ఈ విషయంపై డైరెక్టర్ నందిత దాస్ సీరియస్ అవుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. జ్విగాటో మూవీ ఆస్కార్ లైబ్రరీకి సెలెక్ట్ అయ్యిందనే విషయం తెలుసుకున్న తర్వాత అయినా ఓటీటీ సంస్థలు కొనడానికి ముందడుగు వేస్తాయి అనుకుంటున్నట్టు ట్వీట్ చేశారామె. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ను సొంతం చేసుకుంది.

స్టోరీ విషయానికి వస్తే…

ఓ కంపెనీలో ఫ్లోర్ మేనేజర్ గా పని చేసే మానస్ పలు కారణాలతో ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత వేరే గత్యంతరం లేక ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరతాడు. రేటింగ్స్ ప్రకారం సాలరీ వచ్చే ఆ జాబ్ చేయలేక మానస్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? అనే స్టోరీతో మూవీ సాగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు