Chiranjeevi: “విశ్వంభర”లో సీనియర్ హీరోయిన్… చాలా ఏళ్ల తర్వాత మళ్లీ చిరుతో

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్రత్యేకత చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో పాతుకుపోయారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి… ఆ తర్వాత ఏ హీరో కష్టపడనంత కష్టపడ్డారు. కష్టానికి కేరఫ్ అడ్రస్ చిరంజీవి మారిపోయారు. అంత కష్టపడ్డారు కాబట్టే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్నారు.

ఆయనతో వచ్చిన చాలామంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సక్సెస్ కాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలో రాణించగలిగారు. ఆయన ప్రతిభ చూసి అల్లు రామలింగయ్య కూడా ఫిదా అయిపోయారు. తద్వారా మెగాస్టార్ చిరంజీవి వివాహమైన సంగతి తెలిసిందే. అలా అప్పటి కాలంలోనే మంచి స్టార్డం తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో స్టార్ హీరో అయిపోయారు.

చిరంజీవి హీరో కావడమే కాకుండా… ఆయన ఇంటి నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీని వెళ్తున్నారు. అల్లు అర్జున్ నుంచి వైష్ణవ తేజ్ వరకు… రామ్ చరణ్ నుంచి వరుణ్ తేజ్ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిపోయారు. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. దీనంతటికీ మూల కారణం మెగాస్టార్ చిరంజీవి అన్నది మాత్రం ఎవరు మర్చిపోరు. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్న మెగాస్టార్ చిరంజీవి ఏడాదికి రెండు సినిమాల చొప్పున తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

- Advertisement -
vijayashanthi in vishmbhara movie

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మల్లిడి వశిష్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా ఆయన సరసన హీరోయిన్గా త్రిష ఫిక్స్ అయ్యారు. త్రిష మరియు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా చేస్తు న్నారు. ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ప్రమోద్ ఉప్పల పాటి, విక్రమ్ రెడ్డి మరియు వంశీ కృష్ణ రెడ్డిలు నిర్మాతలుగా కొనసాగుతున్నారు. vijayashanthi in vishmbhara movie

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వాసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో హీరోయిన్ నటించబోతున్నారట. సీనియర్ హీరోయిన్ ప్రస్తుత ,  కాంగ్రెస్ లీడర్ విజయశాంతి మెగా స్టార్ చిరంజీవి లా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. గతంలో విజయశాంతి మరియు చిరంజీవి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. అవి బంపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ చేయ బోతున్నారు దర్శకుడు. కానీ ఇక్కడ విజయశాంతి హీరోయిన్గా కాకుండా ఓ కీలకపాత్ర పోషించనున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. vijayashanthi in vishmbhara movie

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు