Vijay Devarakonda : సలార్ డైరెక్టర్ తో రౌడీ హీరో… కాంబో సెట్ అయితే పూనకాలే

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త వినడానికి ఎంత బాగుందో కదా. తాజాగా జరిగిన పరిస్థితులు చూస్తే అదే నిజమవుతుందేమో అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం ఏంటంటే స్వయంగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. ఇంతకీ వీళ్లిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంట్లో ఎందుకు ఉన్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

కాంబో సెట్ అయినట్టేనా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హైదరాబాదులో ఉన్న విజయ్ దేవరకొండ ఇంట్లో డైరెక్టర్ ప్రశాంత్ కనిపించడంతో కొత్త కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. సోమవారం రోజు రాత్రి ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండకు మధ్య ఓ మూవీ స్టోరీకి సంబంధించిన డిస్కషన్ నడిచినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఈ కాంబోలో మూవీ రాబోతుందనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ విషయం గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు గానీ, విషయమైతే అదే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

ఇది కూడా రీజన్ కావచ్చు..

మరోవైపు ప్రశాంత్ వర్మ కేవలం డిన్నర్ కోసమే విజయ్ దేవరకొండ ఇంటికి వచ్చాడని అంటున్నారు. కానీ ఎలాంటి సంబంధం లేకుండా అసలు ఆయన విజయ్ దేవరకొండ ఇంటికి ఎందుకు డిన్నర్ కోసం వస్తాడు ? అనేది విజయ్ అభిమానుల ప్రశ్న. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాల్సి ఉంది ఈ స్టార్ డైరెక్టర్. ఈ నేపథ్యంలోనే అసలు విజయ్ దేవరకొండ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో సినిమా రావడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది అనే విషయంపై చర్చ నడుస్తోంది. కాబట్టి సలార్ పార్ట్ 2లో లేదా ఎన్టీఆర్ సినిమాలో విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు కొందరు.

- Advertisement -

అయితే విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం డైరెక్ట్ గా ప్రశాంత్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాలని కోరుకుంటున్నారు. ఏదైతేనేం వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోందా అంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. కానీ ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే విజయ్ దేవరకొండ అభిమానులకు పూనకాలే అని చెప్పొచ్చు.

విజయ్ దేవరకొండకు ఇంత పాపులారిటీ ఉన్నప్పటికీ హిట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన గీత గోవిందం తప్ప ఇప్పటివరకు ఆయన ఖాతాలో సరైన బ్లాక్ బస్టర్ మూవీ పడలేదు. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా విజయ్ దేవరకొండ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపైనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ వర్మ స్వయంగా వచ్చి విజయ్ దేవరకొండను కలవడంతో గాల్లో తేలిపోతున్నారు ఈ రౌడీ హీరో ఫ్యాన్స్. మరి విజయ్ దేవరకొండ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు