Ghilli Re-release : రీ – రిలీజ్ తో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్న విజయ్… ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత అంటే…?

Ghilli Re-release.. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి విజయం సాధిస్తే.. దానికి రీమేక్ తప్పకుండా చేస్తారు.. ఈ క్రమంలోనే ఏదైనా రీమిక్స్ సినిమా పెద్ద విజయం సాధిస్తే.. దానికి సగం క్రెడిట్ కచ్చితంగా ఒరిజినల్ సృష్టించిన వాళ్లకే వెళుతుంది. ఇక ఆ సినిమానే ఒక్కడు.. మహేష్ బాబుకి మాస్ లో మంచి పట్టు దక్కేలా చేసిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత పోకిరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గుణ శేఖర్ దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మించిన ఒక్కడు చిత్రం..ఎప్పటికీ బ్లాక్ బాస్టర్ గానే నిలిచిపోయింది. కర్నూలు ఫ్యాక్షన్ డ్రాప్, హైదరాబాద్ చార్మినార్ సెటప్ , ప్రకాష్ రాజ్ విలనిజం, హీరోయిన్ భూమిక.. వీటన్నింటికీ మించి మహేష్ బాబు ఆన్ స్క్రీన్ చరిష్మా అన్నీ కూడా సినిమాకి భారీ విజయాన్ని అందించాయి…

Ghilli Re-release:Vijay breaking the box office with re-release... What is the first day collections...?
Ghilli Re-release:Vijay breaking the box office with re-release… What is the first day collections…?

తమిళ్ లో కూడా సత్తా..

ఇకపోతే ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని దక్కించుకోవడంతో దీన్ని తమిళంలో రీమిక్స్ చేశారు. అదే గిల్లీ.. తమిళంలో విజయ్ స్టార్ డం విపరీతంగా పెరగడానికి ఈ చిత్రం భారీగా దోహదం చేసింది.. ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఈ సినిమాను ఏప్రిల్ 20వ తేదీన చాలా గ్రాండ్ గా రీ – రిలీజ్ చేశారు.. చెన్నై లో హంగామా ఏ స్థాయిలో ఉందంటే రెండు రోజుల ముందే బుక్ మై షో లో 60 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయాయి..

రీ – రిలీజ్ లో కూడా భారీ క్రేజ్..

ముఖ్యంగా ఒక్క చెన్నై నగరంలోనే 300కు పైగా షోలు వేశారంటే.. ఈ సినిమాకి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే తమిళ్ సినిమా గిల్లీ లో కూడా ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. ఇక భూమిక స్థానంలో త్రిష ఒదిగిపోయి నటించింది విద్యాసాగర్ స్వరపరిచిన అపుడి పోడు అనే పాట మ్యూజిక్ లవర్స్ ని ఒక ఊపు ఊపేసిందని చెప్పవచ్చు. అయితే గిల్లి సినిమా అంతగా తమిళ్ వాళ్లను మె
ప్పించడానికి కారణం ఒక్కడు సినిమా అని చెప్పవచ్చు.. పోలికల పరంగా చూసుకున్నా తెలుగు వర్షన్ ఇచ్చినంత ఎక్సైట్మెంట్ గ్రాండియర్ నెస్ తమిళంలో కనిపించదు.. అయినా సరే బ్రహ్మరథం పట్టారు.. ఇలా తమిళ ప్రేక్షకులు కూడా మెచ్చుకున్నారంటే .. గుణశేఖర్ ,పరుచూరి బ్రదర్స్, మణిశర్మలకి ఆ గౌరవం లభిస్తుంది.. మహేష్ కి ఎలాగైతే ఒక్కడు సినిమా కెరియర్ పెరగడానికి దోహద పడిందో.. విజయ్ కి కూడా ఈ సినిమా భారీగా కెరియర్ గ్రాఫ్ ను పెంచేసింది.. అయితే ఈ సినిమాను అర్జున్ కపూర్ హిందీ రీమేక్ తేవర్ అంటూ తెరకెక్కించగా ఊహించని విధంగా డిజాస్టర్ అవడం కొసమెరుపు..

- Advertisement -

మొదటి రోజు రూ.10 కోట్ల గ్రాస్..

ఇకపోతే నిన్న థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదలైన గిల్లి సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ .10 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. రీ రిలీజ్ లో మంచి ఓపెనింగ్స్ తో ప్రారంభమైన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. అంతేకాదు 8.1 ఐఎండీబీ రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు