Allu Arjun: బన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ఏదంటే..?

Allu Arjun.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు.. ఇక తాజాగా ఈయన పుష్ప 2 సినిమాతో భారీ ప్లానింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈయన గురించిన కొన్ని విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. ఇక అందులో భాగంగానే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లు అర్జున్ గతంలో ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట.. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం..

Allu Arjun:What is the movie done by Bunny as an assistant director..?

Allu Arjun:What is the movie done by Bunny as an assistant director..?

అసిస్టెంట్ డైరెక్టర్ గా బన్నీ..

స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ తన కెరియర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారట.. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఇక ఐకాన్ స్టార్ గా తన కెరీర్ లో మంచి పేరు దక్కించుకున్న ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన ఒకే ఒక్క సినిమా పెళ్ళాం ఊరెళితే.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా, సునీల్ , వేణు తొట్టెంపూడి, బ్రహ్మానందం,సంగీత తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. 2003లో వచ్చిన ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు బన్నీ.. ఇకపోతే ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా పనిచేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్ ని ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టించి సినిమాపై అవగాహన వచ్చేలా చేయాలనుకున్నారట అల్లు అరవింద్… ఇక అందులో భాగంగానే ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర పని చేయించారు..

ఆయన దగ్గర పని చేయాలంటే కండీషన్స్ తప్పనిసరి..

నిజానికి ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర పని చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ని మనం పాటించాల్సి ఉంటుంది.. ఆయన పని విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు.. అంతేకాదు సెట్ లో ఆయన రూల్స్ , రెగ్యులేషన్స్, డేడికేషన్ వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఆయన అంటే అల్లు అర్జున్ కి భయమట.. ఏదైనా సందర్భంలో అల్లు అర్జున్ ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు.. ఇక అలా పెళ్ళాం ఊరెళితే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన బన్నీ ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు..

- Advertisement -

అల్లు అర్జున్ సినిమాలు..

ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండేళ్ళ క్రితం పుష్ప సినిమా చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా అటు నార్త్ లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నారు భారీ అంచనాల మధ్య ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే నార్త్లో రూ.200 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది.. మొత్తానికి అయితే ఈ సినిమా అల్లు అర్జున్ ని పాన్ వరల్డ్ హీరోగా మారుస్తుందనడం లో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు అల్లు అర్జున్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు