Vijay Thalapathy: హీరో విజయ్ పై కేసు.. అసలేం జరిగిందంటే..?

Vijay Thalapathy..గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి దేశవ్యాప్తంగా ఎక్కువగా ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కొన్నిచోట్ల ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉండడంతో పలువురు సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. గడిచిన ఏప్రిల్ 19వ తేదీన తమిళనాడు పుదుచ్చేరి పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయి.అయితే ఈ ఎన్నికలలో చాలామంది తమిళ హీరోలు కూడా తమ కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Vijay Thalapathy:The case against hero Vijay.. What actually happened..?
Vijay Thalapathy:The case against hero Vijay.. What actually happened..?

విజయ్ పై కేస్.. సామాన్యుడికి ఇబ్బంది..

అలాగే కోలీవుడ్ హీరో విజయ్ దళపతి కూడా తమ ఓటు హక్కుని వినియోగించారు.. గత కొన్ని నెలలుగా డైరెక్టర్ వెంకట ప్రభు డైరెక్షన్లో రూపొందిస్తున్న ఒక సినిమా షూటింగ్లో విజయ్ పాల్గొన్నారు.. తమిళనాడు ఎన్నికల్లో ఓటు వేయడానికి విజయ్ రష్యా నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ సమయంలోనే ఒక సామాన్యుడు సైతం విజయ్ వల్ల తమకు ఇబ్బంది కలిగిందంటూ హీరో దళపతి పైన కేసు వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది.

సామాన్యుడి ఇబ్బందికి కారణం అదే..

గత కొన్ని సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా పేరు సంపాదించిన విజయ్ ఇటీవల రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నానంటూ.. తమిళ వెట్రికళగం అనే పేరుతో తానే సొంతంగా ఒక పార్టీని కూడా పెట్టబోతున్నట్లు అనౌన్స్మెంట్ చేశారు. అప్పటి నుంచి పలు రకాల కార్యక్రమాలలో విజయ్ చురుకుగానే పాల్గొంటున్నారు.. ఇటీవలే ఓటు వేయడానికి చెన్నైకి వచ్చిన విజయ్ ను చూడడానికి ఆయన అభిమానులు విజయ్ ఇంటిని చుట్టు ముట్టారట. అనంతరం అభిమానులను పలకరించిన విజయ్ దాదాపుగా 150 కి పైగా మంది అభిమానులతో పోలింగ్ బూత్ వద్ద తన ఓటును వినియోగించుకున్నారు.

- Advertisement -

ఎన్నికల నియమాలు ఉల్లంఘించారని..

విజయ్ చుట్టూ ఇంతమంది అభిమానులు రావడంతో అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వారికి చాలా ఇబ్బంది కలిగిందని ఒక సామాన్య వ్యక్తి హీరో విజయ్ పైన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ అంతమంది అభిమానులతో వచ్చి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టారని.. ఎన్నికల నియమాలని ఉల్లంఘించారంటూ కంప్లైంట్ చేశారు.. దీంతో విజయ్ పైన పలు రకాల చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో సామాన్యుడు తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో అభిమానులు సైతం ఓటు వేయడానికి వచ్చిన తమ హీరో ఇలా మరో వివాదంలో చిక్కుకోవడంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన హీరో దలపతి విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

ఏదిఏమైనా అభిమానుల వల్ల విజయ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. ఇక ఆ అభిమానులే ఓటర్లకు అడ్డంకిగా మారారని తెలుస్తోంది. ఇక విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం వెంకట ప్రభు డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు.. ఇక ఈ ఏడాది మాత్రమే సినిమాలు చేస్తారని తర్వాత రాజకీయాల్లోకి బిజీ అవుతారని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు