Volunteer Movie: ఎన్నికలవేళ వాలంటీర్ మూవీ… ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

Volunteer Movie.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తతగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఎంత కీలకంగా మారిందో అందరికీ తెలిసిందే.. అయితే ఇదే వాలంటీర్ వ్యవస్థను గతంలో ప్రత్యర్థి పార్టీలైన జనసేన , టిడిపి ఒక రేంజ్ లో విమర్శించాయి.. వాలంటీర్లకు జీతం దండగా అని , అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని,, అంతే కాదు ఒంటరిగా ఉన్న మహిళల పై పెన్షన్ పేరిట వెళ్లి తలుపుతట్టి మరీ. అత్యాచారాలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోని వాలంటీర్లను తమ వైపు తిప్పుకోవాలని టిడిపి, జనసేన పలు అస్త్రాలు విసరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ లకు 10,000 ఇస్తామని.. మళ్లీ విపక్షాలు కామెంట్ చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.. ఇలాంటి సమయంలో వాలంటీర్ అంటూ ఒక సినిమా తెరకెక్కుతోంది..

Volunteer Movie:Volunteer movie at the time of election... who will lose?  Who's benefits?
Volunteer Movie:Volunteer movie at the time of election… who will lose? Who’s benefits?

వాలంటీర్ సినిమా విశేషాలు..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథను అందించిన చిన్ని కృష్ణ ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే చిన్ని కృష్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై సూర్యకిరణ్ , దియా రాజ్ జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తుండగా.. చిన్ని కృష్ణ సారధ్యంలో రాకేష్ రెడ్డి నిర్మాణంలో వాలంటీర్ అనే సినిమాను తీయబోతున్నారు.. సామాజిక ఇతి వృత్తాంతం తోనే ఈ సినిమా తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ లాంచ్, ఫస్ట్ లుక్ ను తిరుపతిలో రిలీజ్ చేశారు.. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ. ఇందులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఒక ముఖ్య పాత్ర పోషించారు.. సమాజంలో వాలంటీర్ పాత్ర గురించి తెలియజేసే సినిమా ఇది అంటూ చెబుతూనే ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిపోయింది.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అంటూ ఆయన తెలిపారు..

వాలంటీర్ సినిమా ఎవరికి లాభం? ఎవరికి నష్టం..?

ఇకపోతే సామాజిక ఇతివృత్తాంతం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వాలంటీర్ సినిమా.. ప్రజలలో అవగాహన కల్పించే విధంగా తెరకెక్కించామని నిర్మాత స్పష్టం చేశారు.. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఎన్నికలవేళ ఇలాంటి సినిమాను రిలీజ్ చేయడం వైసిపి కి ప్లస్ గానే మారనుంది.. మరోవైపు టిడిపి జనసేన ఈ వాలంటీర్ వ్యవస్థ పై పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పించి ఇప్పుడు ఇదే వాలంటీర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలలో ఎంత ప్రభావితం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. మరికొన్ని రోజుల్లో లోక్సభ పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సినిమా రావడం తో టిడిపి , జనసేన నాయకులు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు ధైర్యంగా గెలవలేక వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఇలాంటి సినిమాలను చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు… పైగా ఇందులో వైసిపి నేత కూడా నటిస్తూ ఉండడంతో పక్కా ప్లాన్ తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎవరికి లాభం చేకూర్చనుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు