Aishwarya Rai: ఒక్క పోస్ట్ తో రూమర్స్ కి చెక్ పెట్టిన ఐశ్వర్య రాయ్..!

Aishwarya Rai.. బాలీవుడ్ లో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన జంటలలో ఐశ్వర్యారాయ్ – అభిషేక్ బచ్చన్ జంట కూడా ఒకటి.. వీరి గురించి గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియాలో పలు రకాల రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ మరింత వినిపిస్తూ ఉన్నాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారనేప్రచారం కూడా జరిగింది. ఇలాంటి విషయాలకు ఎన్నోసార్లు ఐశ్వర్యరాయ్ చెక్ పెట్టినప్పటికీ కూడా ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

Aishwarya Rai: finally Aishwarya clarity with one post for divorce matter..!
Aishwarya Rai: finally Aishwarya clarity with one post for divorce matter..!

పోస్ట్ తో రూమర్స్ కి చెక్..

ఇప్పుడు తాజాగా మళ్లీ అభిషేక్ బచ్చన్ తో కలిసి తాను ఉన్నటువంటి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ముఖ్యంగా తన 17వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకను చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది ఐశ్వర్యరాయ్. తన కూతురుతో కలిసి ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ కూడా ఇందులో కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో వీరు ముగ్గురు సెల్ఫీ దిగినట్టుగా కనిపిస్తోంది.. దీంతో ఈ జంట పైన వస్తున్న రూమర్స్ కు పుల్ స్టాప్ పడినట్టుగా చెప్పవచ్చు.

ఎవరి కుటుంబంలోనైనా సరే సర్వసాధారణంగా సమస్యలు అనేవి ఉంటాయి.. కొన్ని సందర్భాలలో ఇలాంటి విషయాలను పట్టుకొని బ్రేకప్ , విడాకులు అంటూ బాలీవుడ్ మీడియా ఎప్పుడు ఇలాంటివి ఏవో ఒక రూమర్స్ అయితే సృష్టిస్తుందంటూ అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు.. ఇకపోతే తమ గురించి ఎవరు ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేసినా..తాము కలిసే ఉన్నామంటూ మరోసారి నిరూపించింది ఈ ముద్దుగుమ్మ..

- Advertisement -

ఐశ్వర్యారాయ్ సినిమాలు..

ఐశ్వర్యరాయ్ సినిమాల విషయానికి వస్తే.. గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఐశ్వర్యరాయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమెతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు సైతం ఎంతో ఎదురు చూస్తున్నారు.కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం గతంలో లాగా ఇప్పుడు సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ -1,2 రెండు భాగాలలో నటించింది. ఈ సినిమాలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఐశ్వర్యరాయ్ . అయితే తన తదుపరి చిత్రాన్ని మాత్రం ఇంకా ఇప్పటివరకు తెలియజేయలేదు.. ఈమె సినిమా కోసం అభిమానులైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ వారికి నిరాశ మిగులుతోంది.

అభిషేక్ బచ్చన్ సినిమాలు..

మరొకవైపు ఐశ్వర్యరాయ్ భర్త అభిషేక్ బచ్చన్ కూడా సినిమాలు , వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగానే ఉంటున్నారు.. ముఖ్యంగా వీరి కూతురుతోనే ఎక్కువగా గడపడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే కూతురు ఆరాధ్యను కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించేలా పలు రకాల సన్నహాలు చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారనే రూమర్లకు తన 17వ వివాహ వార్షికోత్సవ వేడుకలతో పుల్ స్టాప్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు ఫులిస్టాప్ పడుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు