100 Days for Guntur Kaaram : ప్రెస్టేజ్ ఇష్యూ… ఎలాగోలా వంద రోజులకు లాక్కొచ్చారు..

100 Days for Guntur Kaaram : సినిమా ఇండస్ట్రీలో సిల్వర్ జూబ్లీలు శతదినోత్సవాలు, అర్ధ శతదినోత్సవాలు జరుపుకుని చాలా ఏళ్లయింది. ఈ తరం ఆడియన్స్ శతదినోత్సవాలను ఎప్పుడో మర్చిపోయారు. దాదాపు పదేళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. ఇంటెర్నేషల్ స్థాయికి తెలుగు సినిమా చేరుకోగా, చాలా మార్పులు కూడా సినిమా ఇండస్ట్రీలో జరిగాయి. టెక్నాలజీ ప్రభావం వల్ల అప్పట్లోలా వంద రోజులు, యాభై రోజుల సినిమాలు ఆడట్లేదు. ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజులు బలంగా ఆడితే చాలనుకునే పరిస్థితి వచ్చింది. ప్రేక్షకులకు చివరగా మగధీర చివరగా అత్యధిక సెంటర్లలో వంద రోజులాడినట్టు తెలుసు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ అయితే తప్ప 50 రోజులాడడం లేదు. రీసెంట్ గా హనుమాన్ ఎక్కువ కేంద్రాల్లో యాభై రోజులాడింది. అయితే అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలు 100 రోజులు ఆడుతూ ఉంటాయి. అవి ఆడుతాయో, ఆడిస్తారో థియేటర్ల ఓనర్లకే తెలియాలి. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది.

100 రోజుల గుంటూరు కారం..

ఇదిలా ఉండగా ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం మూవీ (100 Days for Guntur Kaaram) తాజాగా 100 రోజులను పూర్తి చేసుకుంది. గత ఏడాది సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి పోటీ పడి మరీ పలు సెంటర్లలో సంవత్సరం ఆడాయి. అయితే ఆ సినిమాలను థియేటర్లలో నాలుగు షోలతో ఆడించారా ఒక షోతో ఆడించారా అనేది వారికే తెలియాలి. లేదా ప్రెస్టేజ్ కోసం ఫ్యాన్స్ ఆడించారా అన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు అలాగే మహేష్ బాబు గుంటూరు కారం ఆడిందా ఆడించారా అన్న సందేహం కలుగుతుంది. నిన్న ఎప్రిల్ 20న 100 రోజులు పూర్తి చేసుకున్న గుంటూరుకారం ఆంధ్రప్రదేశ్ చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్, అలాగే కర్ణాటక ముల్బాగల్ లోని నటరాజ్ థియేటర్ రెండు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. అక్కడి ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హండ్రెడ్ పోస్టర్స్ వేసి ఘనంగా సెలెబ్రేట్ చేసారు.

ప్రెస్టేజ్ కోసం ఆడించారా?

అయితే నిజానికి గుంటూరు కారం సంక్రాంతి కి వచ్చిన సమయంలో భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ అంత బాగా లేదనే టాక్ తెచ్చుకుంది. దీనికి పోటీగా రిలీజ్ అయిన హనుమాన్ వల్ల పలు ఏరియాల్లో భారీ నష్టాలు అందుకుంది సినిమా. అలాంటిది గుంటూరు కారం వంద రోజులు ఆడిందంటే ఫ్యాన్స్ కి విశేషమనే చెప్పాలి. కానీ పలు హీరోల ఫ్యాన్స్ ఆడించారని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఎదో మహేష్ బాబు వన్ మ్యాన్ షో తో, పండగ ఊపులో భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుని బయ్యర్లు స్వల్ప నష్టాలతో భయరపడ్డారు తప్పితే ఈ సినిమాకు అంత సీన్ లేదన్న మాట వాస్తవమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం అంతగా ఆడలేదనుకున్న గుంటూరు కారం పోస్టర్ల పై వంద రోజుల ముద్ర పడటం ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం వంద రోజుల పోస్టర్లని ఇంకా వేయకపోవడం గమనార్హం. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో సినిమా చేస్తుండగా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు