Venuswamy: హీరోయిన్స్ కోసం చేసే పూజలపై షాకింగ్ కామెంట్స్..!

Venuswamy.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అటు సినీ సెలెబ్రిటీల గురించే కాదు రాజకీయవేత్తల గురించి.. వారి రాజకీయ భవిష్యత్తు గురించి కూడా చెబుతూ వైరల్ గా మారుతూ ఉంటారు.. అంతేకాదు ఒక్కొక్కసారి సెలబ్రిటీల జాతకాలని బయటపెడుతూ ఈయన చెప్పిన మాటలు నిజం కూడా అయ్యాయి. అయితే మరికొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు అనుకోండి..కానీ ఎక్కువ శాతం ఈయన చెప్పిన మాటలే నిజమవుతూ ఉండడం గమనార్హం.. ఇదిలా ఉండగా కొన్ని సంవత్సరాల క్రితం వేణు స్వామి చేత రాజ శ్యామల యాగం చేయించుకుని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్స్ తనతో చేయించుకునే పూజలు వెనుక అసలు విషయం ఇదే అంటూ చెప్పుకొచ్చారు వేణు స్వామి..

Venuswamy: Venuswamy Comments on Pooja for heroines..!
Venuswamy: Venuswamy Comments on Pooja for heroines..!

హీరోయిన్స్ తో పూజలు చేయిస్తే డబ్బు తీసుకోను..

వేణు స్వామి మాట్లాడుతూ.. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ కెరియర్ లో సక్సెస్ కావాలని నాతో పూజ చేయించుకుంటూ ఉంటారు.. ఇక వారికోసం నేను చేసిన పూజలు ఫలించాయి.. వారు అనుకున్నట్టుగానే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే నేను అమ్మాయిల పూజలకు డబ్బులు తీసుకోను.. నాకు డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లైంట్స్ కూడా ఉన్నారు. పొలిటికల్ ,టాప్ బిజినెస్మేన్ నా క్లైంట్స్.. జ్యోతిష్యం చెప్పి డబ్బుల కోసం నేను కక్కుర్తి పడలేను.. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఉంది.. పబ్ కూడా అమ్మేశాను.. అయితే ఒక్క రష్మిక మాత్రమే నాకు డబ్బులు ఇచ్చేవారు.. కానీ వేరే ఏ హీరోయిన్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకోలేదు అంటూ వెల్లడించారు వేణు స్వామి.. ఇకపోతే ఈయనతో రష్మిక , నిధి అగర్వాల్ , డింపుల్ హయతి , బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా, అషు రెడ్డి లాంటి కొంతమంది హీరోయిన్లు పూజలు చేయించుకుని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

నాకు వద్దు కానీ డబ్బులు వారికే..

చాలామంది హీరోయిన్లు పూజలు అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తామని బలవంతం చేస్తారు… అయితే అలా చేసినప్పుడు ఆ డబ్బు నేను తీసుకోను.. కానీ నాతో పాటు వచ్చి పూజ చేసిన పండితులకు 50 వేల రూపాయలు ఇవ్వమని చెబుతాను అంటూ తెలిపారు వేణు స్వామి.. మొత్తానికి అయితే వేణు స్వామి.. ఎంతో మంది హీరోయిన్లకు ఉచితంగా పూజలు చేయించి వారి కెరీర్ కు మార్గం చూపించారని తెలుస్తోంది..

- Advertisement -

వేణు స్వామి కెరియర్..

వేణు స్వామి కెరియర్ విషయానికి వస్తే.. ఆస్ట్రాలజర్ గా అందరికీ తెలుసు కానీ ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా.. అంతేకాదు గతంలో ఒక పబ్ కూడా నిర్వహించేవారు. అలాగే కొన్ని సినిమాలలో కూడా వేణు స్వామి నటించారు.. ఇక ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు లేక ఇలా సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ.. మరొకవైపు హీరోయిన్ లతో పూజలు చేయిస్తూ.. అప్పుడప్పుడు సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భారీగానే పేరు సొంతం చేసుకున్నారు.. ఇక ఈయన భార్య వీణ శ్రీవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..యూట్యూబ్ లో ప్రత్యేకంగా ఛానల్ ఏర్పాటు చేసి తన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది… ప్రతి పాటకి అద్భుతంగా వీణ వాయిస్తూ వీణా వాణిగా పేరు దక్కించుకుంది.. ఇక ఇటీవలే వీణా వాణి కూడా ప్రభాస్ లాంటి వారికి తమ తోటలో పండిన సీతాఫలాలను అందించి తన మంచి మనసు చాటుకుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు