Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నామినేషన్ దాఖలు

BJP candidate Kangana Ranaut files nomination from Mandi: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలోనే ఈ బ్యూటీ బిజెపి పార్టీలో చేరి… ఆ పార్టీలో టికెట్ కూడా సొంతం చేసుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో కూడా నిలు స్తోంది కంగనా రనౌత్. అయితే ఇందులో భాగంగానే ఇవాళ నామినేషన్ దాఖలు చేసింది ఈ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.

లోక్సభ ఎన్నికలకు గాను హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు బిజెపి అభ్యర్థి కంగనా రనౌత్. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తో పాటు ఆమె తల్లి ఆశ రణౌత్, సోదరి రంగోలి కూడా వచ్చారు. గ్రీన్ కలర్ సారీ కట్టుకుని… నామినేషన్ దాఖలు చేశారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.

ఈ నామినేషన్ దాఖలు తర్వాత బాలీవుడ్ హీరోయిన్, బిజెపి ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ మాట్లాడుతూ…. మండి పార్లమెంటు స్థానానికి ఈరోజు నేను నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడి నుంచి పోటీ చేయడం అదృష్టం అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇక కాంగ్రెస్ గురించి అడిగిన ప్రశ్నకు, “కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక మనస్తత్వం దేశానికి ఆందోళన కలిగించే అంశం…” అని ఆమె అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు