Kalki 2898AD : అశ్వద్ధామ టీజర్ తో స్టోరీ హింట్.. శివలింగం తో నిరూపణ..

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘కల్కి2898AD’ రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చుంటుంది. ఇక కల్కి2898AD టీజర్ తో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసిన దర్శకుడు తాజాగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేసి మరింత హైప్ తీసుకొచ్చాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో అమితాబ్ పాత్ర మహాభారతంలోని అశ్వద్ధామ పాత్ర అని రివీల్ చేసిన దర్శకుడు, టీజర్ ద్వారా స్టోరీ హింట్ కూడా ఇచ్చేసాడు. దానికంటే ముందు గా అశ్వద్ధామ పాత్ర గురించి ఆడియన్స్ కి ఒక అవగాహన రావాలి.

మహాభారతంలో అశ్వద్దాముడు..

అయితే మహా భారత యుద్ధంలో ద్రోచాచార్యుడి పుత్రుడైన అశ్వద్దాముడి పాత్ర చాలా ఉంది. మహా భారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన ఇతను యుద్ధం ముగిసే దాకా ఉంటాడు. అంతే కాదు కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవుల తరపున గెలిపించే యోధుల్లో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కర్ణుల తర్వాత అంతటి సామర్ధ్యం అశ్వద్ధామకే ఉంది. అయితే శ్రీ కృష్ణుడి సహాయంతో పాండవులు ధర్మ యుద్ధం చేసి గెలిచారు. ఇక మహాభారత యుద్ధంలో భీష్మ, ద్రోణాచార్య, కర్ణులు సహా మరణించాక, దుర్యోధనుడు కూడా ఓడిపోయాక యుద్ధం ముగుస్తుంది. అప్పుడు స్నేహితుడైన దుర్యోధనుడికి పాండవుల్ని వధిస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట కోసం, అశ్వద్ధాముడు యుద్ధం ముగిసాక పాండవులను చంపడానికి యుద్ధ శిబిరానికి రాత్రివేళ వెళ్లి పాండవులనుకుని నిద్రిస్తున్న కొడుకులైన ఉపపాండవుల్ని వదిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జునుడి ముందే అశ్వద్ధామ పాండవుల వంశాకురం అయిన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షిత్ ని చంపడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దీనికి ప్రతిగా అర్జునుడు కూడా అశ్వద్ధామపై మరో బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అడ్డుకుని ఇద్దర్ని అస్త్రాల్ని ఉపసంహరించుకోమనగా, అర్జునుడు వెనక్కి తీసుకున్నా అశ్వద్దామ వెనక్కి తీసుకోక ఉత్తర గర్భం పై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు గర్భంలో ఉన్న శిశువు మరణించినా, శ్రీ కృష్ణుడు తన యోగ మాయ శక్తితో బతికిస్తాడు.

అశ్వద్ధామకు శ్రీ కృష్ణుడి శాపం..

అయితే శ్రీ కృష్ణుడు ఆగ్రహంతో అశ్వద్ధామని సంహరించకుండా సృష్టి అంతమయ్యే క్షణం వరకు భూమి మీద కురూపిగా, కుళ్ళి కృశించిపోయి బతకమని శపిస్తాడు. అలా సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వద్ధామ, ఇప్పటికీ ఈ భూమి మీద అశ్వద్దామ ఉన్నాడని అంటారు ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ కల్కి2898AD మూవీ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాత్రని తీసుకున్నాడు.

- Advertisement -

టీజర్ తో స్టోరీ హింట్..

అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ యొక్క అశ్వద్ధామ టీజర్ రిలీజ్ కాగా, అందులో స్టోరీ హింట్ ఇచ్చాడు. ఆ టీజర్ లో శివలింగం దగ్గర కూర్చుని జపం చేస్తున్న అశ్వద్ధామ చూస్తుండగా, ఒకానొక సమయంలో శివుడిపై గంగాజలం పడడం ఆగి పోయి, అక్కడ నీటి చుక్క ఉండదు. ఇక ప్రభాస్ కల్కి ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినపుడు కూడా అందులో ఒక చిన్న పిల్లాడికి తాగించడానికి నీళ్లు కూడా ఉండవన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. అప్పుడే అశ్వద్ధామ సమయం వచ్చింది, అంతిమ యుద్ధ సమయం వచ్చింది, తన పేరు అశ్వద్ధామ, ద్రోణాచార్య పుత్రుణ్ణి అంటూ బయటికి వస్తున్నట్టు చూపించాడు. అయితే శ్రీ కృష్ణుడు అశ్వద్ధామని శపిస్తూ, భూమ్మీద జీవం ఉన్న వరకు, నీరు, చెట్లు ఉన్నంత వరకు నువ్వు బయటికి రాలేవు. ఆకలి తో అలమటిస్తావు అంటాడు. కలియుగాంతం లో జీవరాశి అంతమయ్యే క్షణంవచ్చేవరకు గాని తనకు ముక్తి లభించదు అంటాడు. అయితే టీజర్ లో, నీరు కూడా మనుషులకి దొరకనట్టు, జలం అంతరించిపోయే దశలో ఉన్నట్టు చూపిస్తాడు. టీజర్లో ఒక్క చెట్టు కూడా చూయించలేదు. అంటే కలియుగాంతం వచ్చేసిందని, శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వస్తున్నాడని, ఇక అశ్వద్ధామ కి శాప విముక్తి దొరుకుతుందేమో అన్నట్టు టీజర్ ద్వారా చూపించారు. మరి అశ్వద్ధామ పాత్ర ని కలియుగంలో నాగ్ అశ్విన్ తన పాత్ర మళ్ళీ యుద్ధం చేస్తుందని అన్నట్టు చూపిస్తున్నాడా? లేక ప్రాయచిత్తంతో ఇతరులకి సాయపడేలా పాత్ర ని డిజైన్ చేశాడా అన్నది నాగ్ అశ్విన్ చేతుల్లోనే ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు