Keerthy Suresh : చీరలో మహానటి ఫోటోషూట్ వైరల్.. ఆ చీర ఎంత?

Keerthy Suresh : టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ తో పరిచయమై సౌత్ లో వరుస సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన ఈ భామ మహానటి తో అసలైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుని రికార్డు సృష్టించింది కీర్తి. అయితే అనూహ్యంగా ఆ సినిమా తర్వాత వరుస ప్లాపులు పలకరించడంతో తన ఫామ్ కోల్పోయి స్టార్ డమ్ ని కూడా కోల్పోయే దశకు వచ్చింది. అయితే అడపాదడపా ఇప్పటికి సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. కాకపోతే ఏ భాషలోనూ స్థిరంగా లేదు. ఇకపోతే లాస్ట్ ఇయర్ భోళా శంకర్ లో చిరు చెల్లిగా నటించి మెప్పించినా, ఆ సినిమా అంతగా ఆడలేకపోయే సరికి అవకాశాలు తగ్గిపోయాయి. అయితే తెలుగులో ఆఫర్లు లేకపోయినా తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే మలయాళంలో మరో సినిమాతో బిజీగా ఉంది.

చీరలో మహానటి ట్రెండ్..

అయితే కీర్తి సురేష్ (Keerthy Suresh) సినిమాలతో అంత హడావిడి చేయకపోయినా, సోషల్ మీడియా లో తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు, రీల్స్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది. అంతే కాదు ఇండస్ట్రీ లో సినిమాల మీద స్పందిస్తూ సందడి చేస్తుంటుంది. ఇక తాజాగా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన చీర ఫోటోషూట్ ట్రెండ్ అవుతుంది. ఆ చీరలో చిన్న చిన్న అద్దాలు పొదిగిన కాస్ట్యూమ్స్ తో అంతో న్యాచురల్ గా అందంగా ఉంది మహానటి. నిజానికి ఇలాంటి ఫోటోషూట్లతోనే కీర్తి సురేష్ మంచి ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. అయితే మహానటి తర్వాత కీర్తి ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండకుండా పలు సినిమాల్లో రొమాంటిక్ సీన్లలో నటించడం వల్ల తన క్రేజ్ తగ్గిందని నెటిజన్లు అంటుంటారు.

చీర కాస్ట్ ఎంతో తెలుసా?

అయితే తాజాగా కీర్తి సురేష్ కట్టుకున్న ఆ చీర సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుండగా, చాలా మంది లేడీస్ ఆ చీర గురించి ఆరా తీస్తున్నారు. ఇక టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ తన గ్లామర్ లుక్ లో చీరతో అదరగొడుతోంది. అయితే కీర్తి సురేష్ కట్టుకున్న ఆ చీర ఎంతో విలువైందని తెలుస్తుంది. కీర్తి కట్టుకున్న ఆ ట్రెడిషనల్ చీర ఖరీదు అక్షరాల 2లక్షల 99వేల రూపాయలుగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్ శంకర్ షణ్ముగం కుమార్తె పెళ్లి వేడుక కోసం కీర్తి ఆ చీర డిజైన్ చేయించిందట. ఇక కీర్తి సురేష్ కట్టుకున్న ఆ చీర ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా రెండు గంటల్లోనే మూడు లక్షల లైక్స్ తెచ్చుకుంది. ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ్ లో రఘుతత, రివాల్వర్ రీటా సినిమాల్లో నటిస్తుండగా, తెలుగులో కథలు వింటుంది. అయితే ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేకపోగా, తెలుగులో కంటెంట్ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం అంటుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు