Sai Pallavi: మెగా హీరోకి కమిట్ అయిన సాయి పల్లవి..!!

డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసిన హీరోయిన్ సాయి పల్లవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తొలి సినిమాతోనే నటనతో, అందంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత పలు చిత్రాలలో నటించి మెప్పించింది. కేవలం కంటెంట్ ఉన్న పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, గ్లామర్ షోలకు ఆమడ దూరంలో ఉంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. అయితే సాయి పల్లవి దాదాపు రెండేళ్లుగా యాక్టివ్ గా లేదు.

ఆమె తెలుగులో పాటు తమిళ్ లో కూడా చిత్రాలకు సైన్ చేయలేదు. తమిళ్ లో గార్గీ టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ చిత్రం చేసింది. ఇది తెలుగులో కూడా అదే టైటిల్ తో రిలీజ్ అయింది. దీని తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవి కనిపించలేదు. అయితే తాజాగా సాయి పల్లవి మళ్లీ తన కెరీర్ ని స్పీడ్ అప్ చేసింది. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళ్ లో రెండు సినిమాలకు కమిట్ అయిన సాయి పల్లవి తాజాగా తెలుగులో నాగచైతన్య – చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా నటిస్తోంది.

అయితే తాజాగా రామ్ చరణ్ సినిమాలో కూడా నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేమ్ చేంజర్ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చాలా రోజుల క్రితమే వచ్చింది. కానీ గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం కావడం ఆ ఎఫెక్ట్ బుచ్చిబాబు మూవీ పై పడింది.

- Advertisement -

గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు మూవీ షూటింగ్ ని చరణ్ మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు ఇటీవల బుచ్చిబాబు తెలిపారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సాయి పల్లవి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మొదట జాన్వి కపూర్, మృనాల్ ఠాకూర్ లాంటి గ్లామరస్ బ్యూటీలను అనుకున్నారట.

కానీ కథ పరంగా చాలా డెప్త్ ఉండడంతో సాయి పల్లవి లాంటి వాళ్లు అయితేనే ఈ సినిమాకి హైప్ వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారట బుచ్చిబాబు. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సాయి పల్లవితో కథ పరంగా, రెమ్యునరేషన్, డేట్స్ పరంగా పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే దీనిపై ఫుల్ క్టారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

Check outFilmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. It also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు