Operation Valentine : రెండు రోజుల్లో పాతిక ఇంటర్వ్యూలు?

Varuntej

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా “ఆపరేషన్ వాలెంటైన్” మార్చ్ 1న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో ఫిబ్రవరి 16 కి వాయిదా వేయగా, బాలీవుడ్ ఫైటర్ రిజల్ట్ చూసి మళ్ళీ వెనక్కి తగ్గారు. ఫైనల్ గా మార్చి 1న రావడానికి ఫిక్స్ అయ్యారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసిందే.

మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ మంచి రెస్పాన్స్ తెచుకున్నప్పటికీ, చాలా సార్లు వాయిదా పడడం వల్ల ఆపరేషన్ వాలెంటైన్ పై ఉన్నక్రేజ్ కాస్త తగ్గింది. అందుకే చిత్ర యూనిట్ గత వారం రోజులుగా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో వరుణ్ తేజ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ తో కలిసి వరుస ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు. అక్కడ పాపులర్ టివి షోలలో కూడా పాల్గొన్న వరుణ్, చివరి 2,3 రోజుల్లో ఏకంగా 25 కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చాడని ట్రేడ్ విశ్లేషకుల నుండి సమాచారం అందింది.

- Advertisement -

అంటే ఆపరేషన్ వాలెంటైన్ ని బాలీవుడ్ లో ఏ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారో అర్ధమవుతుంది. ఏది ఏమైనా గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్ కి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ నెల మూడో వారంలో ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు