Operation Valentine : వరుణ్ కు పొంచి ఉన్న మరో గండం… “ఫైటర్” కథ రిపీట్ కానుందా?

మెగా హీరోల్లో ఒకరైన వరుణ్ తేజ్ గత కొంతకాలంగా హిట్ కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు. ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలు గని, గాంధీవదారి అర్జున ఎప్పుడు రిలీజ్ అయ్యాయి అన్న విషయం కూడా కనీసం ఎవ్వరికీ తెలీదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాపై దృష్టి పెట్టిన వరుణ్ డిఫరెంట్ కంటెంట్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో “ఆపరేషన్ వాలెంటైన్” అనే మూవీతో తన మార్కెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ఐఏఎఫ్ వరుణ్ ను వదులుతుందా? అనే అనుమానం మొదలైంది.

మరి కొన్ని గంటల్లో తెరపైకి “ఆపరేషన్ వాలెంటైన్”…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వార్ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రొమాన్స్ చేయబోతోంది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం బిజీగా ఉంది. మేకర్స్ ముఖ్యంగా హిందీ రిలీజ్ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే తెలుగులో కంటే ఎక్కువగా హిందీలోనే ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే థియేటర్లోకి రాబోతున్న “ఆపరేషన్ వాలెంటైన్” మూవీతోనైనా వరుణ్ హిట్ అందుకుంటాడా? అనే ఉత్కంఠత నెలకొంది.

వరుణ్ కు పొంచి ఉన్న మరో గండం
ఎయిర్ ఫోర్స్, వైమానిక దాడులు ప్రధాన కథాంశంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దేశభక్తి, ప్రేమ పంటి అంశాలను కలగలిపి కమర్షియల్ వార్ ఎంటర్టైనర్ గా “ఆపరేషన్ వాలెంటైన్” రూపొందింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లలో ఎయిర్ స్ట్రైక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ ఈ సినిమాలో కెప్టెన్ రుద్రగా కనిపించబోతుండగా, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన వైమానిక దాడుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పలు వాయిదా అనంతరం ఈ మూవీని మార్చ్ 1న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఇక్కడే మరో కొత్త సమస్య మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ఐఏఎఫ్ డ్రెస్ వేసుకొని వరుణ్ హీరోయిన్ తో చేసిన రొమాన్స్ పై ఐఏఎఫ్ అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది.

- Advertisement -

రీసెంట్ గా “ఫైటర్”కూ ఇదే సమస్య
రీసెంట్ గా రిలీజైన “ఫైటర్” మూవీలో హీరో, హీరోయిన్లు ఐఏఎఫ్ డ్రెస్ ధరించి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం, రొమాన్స్ చేయడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రంగా స్పందించింది. ఏకంగా మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపింది. ఇక ఇప్పుడు “ఆపరేషన్ వాలెంటైన్” మూవీలో కూడా దాదాపుగా అలాంటి సన్నివేశాలు ఉన్నాయనే విషయం ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. మరి ఈ మూవీకి ఐఏఎఫ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయో చూడాలి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు