Tillu Square : అవి ఓ రేంజ్ లో ఉన్నా సెన్సారోళ్ళు అడ్డుచెప్పలేదు?

టాలీవుడ్ లో మార్చి నెలలో రిలీజ్ అయ్యే క్రేజీ సినిమా ఏదైనా ఉంది అంటే అది ‘టిల్లు స్క్వేర్’ అని మాత్రమే అని చెప్పాలి. అయితే మార్చి నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమాలకీ పెద్దగా క్రేజ్ లేదా? అంటే వాటి జోనర్ లో అవి మంచి అంచనాలతో రిలీజ్ కావడం జరిగింది. కానీ ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమా మాత్రం ఇదే. ఎందుకంటే రెండేళ్ల కింద ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటింది మరి. రెండేళ్ల కింద బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది. సిద్ధూ జొన్నల గడ్డ హీరోగా నటించడమే కాదు ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే కూడా తానే అందించడం జరిగింది. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించాడన్న సంగతి తెలిసిందే.

సెన్సార్ పని కూడా అయిపొయింది..

మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతుంది. ఇక టెక్నికల్ గా కూడా అన్ని పనులు పూర్తయిపోయాయట. రెండు వారాల కింద టిల్లు స్క్వేర్ కాకినాడ లో షూటింగ్ జరుగుతుండడం వల్ల ఈ సినిమా రిలీజ్ టైం కి రెడీ అవుతుందా లేదా అన్న సందేహం లో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ సమయానికి షూటింగ్ పూర్తి చేసుకుని, రిలీజ్ కి రెడీ అయిపోతుంది టిల్లు స్క్వేర్. ఇక టిల్లు స్క్వేర్ ఫైనల్ గా సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకోవడం విశేషం. అయితే సెన్సార్ నుండి ఈ సినిమాకి UA సర్టిఫికెట్ రావడం జరిగింది. అయితే ట్రేడ్ విశ్లేషకులు సైతం ఈ సినిమాకి యూఏ వస్తుందని అనుకోలేదట. దానికి కారణాలు ఉన్నాయి.

- Advertisement -

UA వస్తుందని అనుకోలేదు..

టిల్లు స్క్వేర్ సినిమాకి యూఏ సర్టిఫికెట్ వస్తుందని చాలా మంది అనుకోలేదు. ఎందుకంటే ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్ అయినా కూడా, రొమాంటిక్ డోస్ ఓ రేంజ్ లో ఉంటాయని టీజర్, ట్రైలర్ లతోనే తెలిసిపోయింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటల్లో కూడా అది చాలా ఉంది. హీరోయిన్ తో లిప్ లాక్ సీన్లు చాలా ఉన్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సినిమాలో ఇంటిమేట్ సీన్లు కూడా ఉంటాయట. దానివల్ల ఈ సినిమా కి ఏ సర్టిఫికెట్ వస్తుందని నెటిజన్లు భావించారు. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం ఏం పర్లేదని యూఏ సర్టిఫికెట్ ఇచ్చేసారు. అయితే రెండు వారాల కింద రిలీజ్ అయిన గామి, భీమా సినిమాలకు కూడా వైలెన్స్ ఎక్కువగా ఉందన్న ఒక్క కారణంతో, ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ వాళ్ళు, టిల్లు స్క్వేర్ కి మాత్రం యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం ఆశ్చర్యం గా ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు