OTT Movies : ఒకేరోజు ఒకే కాన్సెప్ట్ సినిమాలు.. ఇదే బెటర్ అంటున్న ఆడియన్స్..

ఓటిటి సినిమాల్లో ఈ వారం రెండు క్రేజీ సినిమాలు ఆడియన్స్ ని మెప్పించడానికి రిలీజ్ అయ్యాయి. రెండు భారీ బడ్జెట్ సినిమాలు కాగా, ఆ రెండు కూడా ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. ఆ రెండు సినిమాలు వేరే వేరే ఓటిటి లలో రిలీజ్ అయినా, రెండింటి కథా నేపథ్యం ఒక్కటే. ఆ సినిమాలే ఒకటి ఫైటర్, అలాగే మరొకటి ఆపరేషన్ వాలెంటైన్. ఫైటర్ సినిమా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన సినిమా కాగా, ఆపరేషన్ వాలెంటైన్ తెలుగు సినిమా కాగా ఇందులో వరుణ్ తేజ హీరోగా నటించాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ రెండు సినిమాలు ఒకే కథాంశంతో కొన్నేళ్ల క్రితం జరిగిన పుల్వామా ఎటాక్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. ఇక ఫైటర్ సినిమా జనవరి 25న రిలీజ్ కాగా, మిక్సడ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లను రాబట్టింది. కానీ యావరేజ్ గా మిగిలిపోయింది.

ఒకే కథాంశం..

ఇక వరుణ్ తేజ్ సినిమా విషయానికి వస్తే తాను నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మూడు వారాల కిందట అంటే, మార్చి 1న థియేటర్లలో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయింది ఈ సినిమా. క్రిటిక్స్ నుండి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కంటే ముందు ఫైటర్ సినిమా రిలీజ్ కావడం వల్ల, రెండు ఒకే కాన్సెప్ట్ తో తెరకెక్కడం వల్ల, ఆడియన్స్ ఈ సినిమా కాపీ అని దెబ్బేసారు. దాదాపుగా అసలు చూడాలనేలేదు. దీంతో డిజాస్టర్ పాలయింది ఈ సినిమా. అయితే నిజానికి ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఫైటర్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకున్నా, పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ ఫైటర్ తర్వాత రిలీజ్ అయింది. అందువల్ల ఫైటర్ ఇంపాక్ట్ ఈ సినిమాపై పూర్తిగా పడిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలు యాధృచ్చికంగా ఓటిటి లో ఒకేరోజు రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ రెండు సినిమాల స్పందన ఓటిటి డిఫరెంట్ గా ఉందని వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

దానికంటే ఇదేనయం.?

బాలీవుడ్ మూవీ ఫైటర్ నెట్ఫ్లిక్స్ లో మార్చి 22న రిలీజ్ కాగా, ఆపరేషన్ వాలెంటైన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావడం జరిగింది. ఇక రిలీజ్ అయ్యాక ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ నుండి ఆపరేషన్ వాలెంటైన్ సినిమాయే బాగుందని టాక్ వస్తుంది. ఫైటర్ సినిమా కమర్షియల్ గా ఉందని, దాంతో పోలిస్తే ఆపరేషన్ వాలెంటైన్ డీసెంట్ గా ఉందని కొందరు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారట. అయితే ఓటిటి లో ఎంత డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లలో లాస్ అయ్యాక ఆ నష్టాన్ని పూడ్చలేదు. ఫైటర్ కంటే ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం పరిస్థితి వేరేలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా ఓటిటి లో కూడా ఈ రెండు సినిమాలకు వాటి వాటి సినిమాల స్థాయిలో మిక్సడ్ రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు