Sriya Reddy : సినిమాల కంటే ఈ పనిలోనే ఎక్కువ బిజీ?

కోలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీయా రెడ్డి సలార్ లో కీలకపాత్రలో నటించిందన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రాధా రమా మన్నార్ గా శ్రీయా రెడ్డి కీలకపాత్రలో నటించి మెప్పించింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ హీరోయిన్ పెద్దగా సినిమాలు చేయకపోయినా సలార్ తర్వాత మాత్రం సాలిడ్ క్రేజ్ తెచ్చుకుని బిజీ అయింది. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే శ్రీయ రెడ్డి నిజానికి తెలుగమ్మాయే కావడం విశేషం. చెన్నై లో స్థిరపడ్డ తెలుగు అమ్మాయి కావడం వల్ల ముందుగా తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. చియాన్ విక్రమ్ నటించిన సమురాయ్ సినిమాలో చిన్న పాత్రలో గెస్ట్ గా నటించిన ఈ భామ, తెలుగులో అప్పుడప్పుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఆ తర్వాత అమ్మ చెప్పింది సినిమాలో కూడా మంచి పాత్రలో నటించింది. అయితే తెలుగు వారికి బాగా కనెక్ట్ అయింది మాత్రం విశాల్ నటించిన పొగరు సినిమాతో. ఆ సినిమాలో విలన్ గా నటించిన శ్రీయ రెడ్డి మంచి పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది.

ఇక ఆ తర్వాత శ్రీయా రెడ్డి వరుస సినిమాల్లో నటించింది. అయితే సక్సెస్ మాత్రం కనిపించకపోడవంతో ఆఫర్లు తగ్గు ముఖం పట్టాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించడం మొదలెట్టింది. ఇక నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ నటించిన ప్రభాస్ సలార్ సినిమాలోని పాత్ర శ్రీయారెడ్డి పాత్ర ఓ రేంజ్ గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఇక సలార్ సినిమా తర్వాత శ్రీయా రెడ్డి చాలా బిజీ అయిందని చెప్పొచ్చు. తమిళ్ తో పాటు, తెలుగులో కూడా సినిమా చేయబోతోందని సమాచారం. ఇక ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజిలో ముఖ్య పాత్రను పోషిస్తుంది శ్రీయా.

అయితే శ్రీయ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది. సినిమా తర్వాత వారానికో ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతుంది. తాజాగా శ్రీయా రెడ్డి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫొటోలో బ్లాక్ డ్రెస్ తో హాట్ ఫోజులిచ్చింది. అయితే అంతకు ముందు కూడా శ్రీయా రెడ్డి ఇలాంటి హాట్ ఫోజులిస్తూ ట్రెండ్ అవుతుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సినిమాలు చేయడం వీలవుతుంది. ఇక శ్రీయా రెడ్డి ముందు నుండి మెల్లిగా సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ సలార్ రిలీజ్ తరవాత శ్రీయ రెడ్డి సినిమాల్లో స్పీడ్ పెంచింది.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు