Eesha Rebba : ఆ విషయంలో తానేమి తక్కువకాదంటున్న తెలుగమ్మాయి..

టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లో చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేది ఇషా రెబ్బ. అందంతో పాటు టాలెంట్ కూడా ఉన్న ఈ భామ చిన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించినప్పటికీ మంచి పేరున్న పాత్రలు చేసింది. పైగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేసింది. ఇక ఈ భామ అమితుమీ, బ్రాండ్ బాబు వంటి చిత్రాలతో మంచి హిట్స్ కొట్టినా పెద్ద సినిమాల్లో ఆఫర్లు అయితే రాలేదు. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ అరవింద సమెత లో హీరోయిన్ చెల్లిగా సైడ్ రోల్ లో నటించింది. కానీ దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఇక అడపాదడపా ఇతర భాషల్లోనూ అప్పుడప్పుడూ మూవీ ఆఫర్లు వచ్చాయి. అయినా వాటి వల్ల అక్కడ ఒరిగిందేమి లేదు. ఇతర భాషల్లో చేసిన కొన్ని సినిమాలు కూడా ఆడకపోవడంతో కావడంతో తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇషా రెబ్బ తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు అయితే రావడంలేదు. వచ్చిన మూవీస్ లో కూడా పెద్ద సినిమా అయితే చిన్న పాత్ర, చిన్న సినిమా అయితే యాక్టింగ్ స్కోప్ లేని రోల్స్ వస్తున్నాయి.

ఓటిటి లోనూ ప్రయత్నం..

అయితే సినిమాల్లో ఆఫర్లు పెద్దగా లేకపోయినా ఈషా రెబ్బ ఓటిటి సినిమాలు, వెబ్ సిరీస్ లో మాత్రం ఛాన్స్ లు మాత్రం బాగాపొందుతూ ఉంది. ఇప్పటికే ఓటిటి లో 3 రోసెస్, పిట్ట కథలు వంటి వెబ్ సిరీస్ లో నటించిన ఇషా, లాస్ట్ ఇయర్ “మాయాబజార్ ఫర్ సేల్” అనే కామెడీ వెబ్ సిరీస్ లో నటించింది. ఇక జీ 5లో ప్రసారమవుతున్న ఆ సిరీస్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదే గాక రీసెంట్ గా మరో వెబ్ సిరీస్ ద్వారా మరో మంచి పాత్రతొ ఆడియన్స్ ని పలకరించింది ఇషా రెబ్బ. విలక్షణ నటుడు జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన “దయా” అనే వెబ్ సిరీస్ లో ఇషా ఫిమేల్ లీడ్ గా నటించింది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయినా కూడా సినిమా ఛాన్సులు పెద్దగా రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ మామ మశ్చింద్ర అనే చిత్రంలో నటించిన ఈషా, ఈ ఇయర్ ఒక్క సినిమాతో కూడా ఇంకా పలకరించలేదు.

- Advertisement -

ఆ విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదు..

అయితే ఈషా రెబ్బ కి సినిమా ఆఫర్లు తక్కువగా వస్తున్నప్పటికీ ముంబై స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తగ్గకుండా ఈషా రెబ్బ తన ప్రతిభను చాటుతుంది. అదేంటంటే ఈషా రెబ్బ తాజాగా చేసిన గ్లామర్ షో నెట్టింట వైరల్ అవుతుంది. ఇకపోతే అయితే టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు పెద్దగా గ్లామర్ షోస్ కి దూరంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు జనాలు. కానీ బాలీవుడ్ హీరోయిన్లకి తానేమి తక్కువ కాదని నిరూపిస్తూ తాజాగా ఓ ఫోటోషూట్ లో హాట్ గా మెరిసింది ఈషా రెబ్బ. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటుంది ఈషా.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు