Devara : చరణ్ ఫ్యాన్స్ లా తారక్ ఫ్యాన్స్ కూడా దీంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో గేమ్ ఛేంజర్, అలాగే దేవర సినిమాల గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలకు కాస్త దగ్గరి పోలికలున్నాయి. అయితే అది కథ విషయంలో కాదు లెండి. జరుగుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి. RRR వంటి భారీ మల్టీ స్టారర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ లు సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు రాజమౌళి RRR సినిమా రిలీజ్ కి ముందే అనౌన్స్ మెంట్ జరగడం గమనార్హం. ఇక రాజమౌళి సినిమా పూర్తి కాగానే ఈ సినిమాలు మొదలెట్టారు ఇద్దరు హీరోలు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వెంటనే మొదలు పెట్టగా, ఎన్టీఆర్ మాత్రం దేవర స్క్రిప్ట్ డెవలప్మెంట్ కోసం కాస్త టైం తీసుకున్నారు. అయితే మొదలుపెట్టగానే ఆ సినిమా కూడా వరుస షెడ్యూల్స్ తో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ రెండు సినిమాలు మొదలై దాదాపు మూడేళ్ళ పైనే కాగా, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ రెండున్నరేళ్ల నుండి షూటింగ్ జరుగుతుండగా, ఎన్టీఆర్ దేవర ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఈ సినిమాల షూటింగ్ ఇప్పటికి ముగింపు దశకు చేసుకోలేదు.

ఒక్క అప్డేట్ కూడా లేదు..

ఇక అసలు విషయానికి వస్తే గేమ్ ఛేంజర్, దేవర సినిమాల నుండి షూటింగ్ లు జరుగుతున్నా, సినిమాలకి సంబంధించి ఇతర అప్డేట్స్ మాత్రం ఏమి రావడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై పక్కా క్లారిటీ మేకర్స్ కి కూడా లేదు. ఇక గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇప్పటివరకూ ప్రకటించలేదు. దేవర సమ్మర్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, దసరా కి షిఫ్ట్ అయింది. ఇక దసరా కి కూడా రాకపోవచ్చని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాల నుండి ఫస్ట్ లుక్ తప్ప మరే ఇతర అప్డేట్లు రాలేదు. కనీసం దేవర నుండి టీజర్ అయినా వచ్చింది. కానీ గేమ్ ఛేంజర్ నుండి అది కూడా రాలేదు. ఇక ఈ సినిమాల నుండి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్.

- Advertisement -

లీకులే లీకులు.. వాటితోనే సంతృప్తి..

అయితే ఈ రెండు పాన్ ఇండియా సినిమాల నుండి ఒక్కటి మాత్రం రిపీట్ అవుతూనే ఉంది. అదే లీకుల గోల. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా నుండి ఇప్పటివరకు పదుల సంఖ్యలో రామ్ చరణ్ స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ పాత్రల గురించి లీక్స్ తోనే సగం కాన్సెప్ట్ తెలిసిపోయింది. ఇప్పుడు మేకర్స్ ఆ పాత్రల గురించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినా పెద్దగా సప్రైజ్ అవ్వరు. ఇక ఏ అప్డేట్స్ లేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ బిర్యానీ దొరకనోడికి పప్పన్నమే ఎక్కువ అన్నట్టు లీక్ అవుతున్న స్టిల్స్ తో ఫ్యాన్స్ సంతృప్తి పడుతున్నారు. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ది కూడా అదే పరిస్థితి అయిందని చెప్పొచ్చు. దేవర నుండి ఏ అప్డేట్స్ రాకపోగా, నిరాశలో ఉన్న ఫాన్స్ కి లీక్ అవుతున్న దేవర లుక్స్ తో సంతృప్తి పడాల్సి వస్తుంది. మరి ఈ సినిమాల నుండి ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు