Family Star: సినిమా కథ రీవీల్ చేసిన దిల్ రాజు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతరంలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు, దిల్ అనే సినిమాతో నిర్మాతగా మారారు. అక్కడితోనే వెంకటరమణారెడ్డి దిల్ రాజు అయ్యాడు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.

ఈ బ్యానర్లో వచ్చిన సినిమాలు మినిమం గ్యారంటీ అని ఆడియన్స్ కి ఒక రకమైన నమ్మకం ఉంది. ఆర్య, బొమ్మరిల్లు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బృందావనం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించింది ఈ సంస్థ. ఇకపోతే ఈ సంస్థ అది తక్కువ టైంలోనే దాదాపు 50 సినిమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం గేమ్ చేంజర్.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. కానీ ఆ కాంబినేషన్ ఇప్పటివరకు తెరకెక్కలేదు. కానీ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం దొరికింది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని పండక్కి రిలీజ్ చేస్తామని ఇదివరకే అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

- Advertisement -

ఇకపోతే ఈ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఇంకో సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ సరసన మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఇదివరకే వీరి కాంబినేషన్లో గీతగోవిందం అంటే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. అందుకోసమే ఈ సినిమా పైన మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఇదివరకే రిలీజ్ చేస్తారు అధికారికంగా ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వలన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోయారు.

ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక వేడుకలో దిల్ రాజు ఈ సినిమా కాన్సెప్ట్ ను రీవీల్ చేసారు. “ఎక్కడో ఉన్న మీ కుటుంబాలని, పైకి తీసుకొస్తూ…కుటుంబంని ఎక్కడికో తీసుకువెళ్లిన వాళ్ళందరూ ఫామిలీ స్టార్స్ అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అదే అని చెప్పేశారు. విజయ్ దేవరకొండ ని స్టార్ గా చూపియ్యాలని కాదు. దిల్ రాజు బ్రాండ్ ఫ్యామిలీ సినిమా వచ్చేటప్పుడు ఎలా ఉంటదో అలానే ఉంటది. అంటూ చెప్పుకోచ్చారు దిల్ రాజు.

ఇకపోతే ఈ కాంబినేషన్లో సినిమా గీత ఆర్ట్స్ లో జరగాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్టు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో జరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇదివరకే మీరు కాంబినేషన్లో గీతగోవిందం హిట్ సినిమా రావడం. ఈ సినిమాకి మంచి రిలీజ్ డేట్ దొరకటం. ఇవన్నీ కూడా ఈ సినిమా కలిసి వచ్చిన మంచి శకునములు. సినిమాకి మినిమం టాక్ వచ్చినా కూడా సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధిస్తుంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు