Monkey Man Trailer 2 Talk : మంకీ మ్యాన్ విశ్వరూపం… కానీ మనోభావాలు దెబ్బతిన్నాయా?

“హనుమాన్” మూవీ మేనియా నడుస్తున్న సమయంలోనే “మంకీ మ్యాన్” అనే హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్ ను చూసాక హాలీవుడ్ మూవీ “హనుమాన్” ఇన్స్పిరేషన్ తో రూపొందుతుందని అంతా భావించారు. కానీ తాజాగా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ అందరి అంచనాలను తలకిందులు చేసింది. ముఖ్యంగా రెండవ ట్రైలర్ లో ఉన్న కొన్ని సన్నివేశాల కారణంగా ఒక వర్గం మనోభావాలు దెబ్బ తినే అవకాశం లేకపోలేదు. “మంకీ మ్యాన్” సెకండ్ ట్రైలర్ విశేషాలు ఏంటి? మనోభావాలు దెబ్బ తినేంతగా అందులో ఏముంది అసలు? అంటే…

సెకండ్ ట్రైలర్ తో ఊహించని ట్విస్ట్…

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన దేవ్ పటేల్ తాజా చిత్రం “మంకీ మ్యాన్”. ఈ హీరో లయన్, ది మాన్ హూ నో ఇన్ఫినిటీ, ది గ్రీన్ నైట్, హోటల్ ముంబై వంటి హాలీవుడ్ చిత్రాలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం దేవ్ పటేల్ “మంకీ మ్యాన్” సినిమాతో డైరెక్టర్ గా టర్న్ అవుతున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా దేవ్ పటేల్ వ్యవహరిస్తుండడం విశేషం. “మంకీ మ్యాన్”లో దేవ్ పటేల్ కు జంటగా శోభిత దూళిపాళ్ల నటిస్తోంది. ఆమెకు ఇదే మొదటి హాలీవుడ్ చిత్రం. ఈ సినిమా పేరుకే హాలీవుడ్ మూవీ, ఇందులో నటిస్తున్న యాక్టర్స్ అందరూ ఇండియన్ వారే కావడం మరో విశేషం. ముంబై సిటీలో రూపొందుతున్న ఈ హాలీవుడ్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ లో ఎవ్వరూ ఊహించని విధంగా వైలెన్స్, ఆల్కాహాల్, అసభ్యకర సన్నివేశాలు ఉన్నాయి. నిజానికి ఇదొక హాలీవుడ్ మూవీ. కాబట్టి హాలీవుడ్ ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా మూవీని తెరకెక్కించారు. కానీ ఇండియన్ సినీ ప్రియులకే ఇది మింగుడు పడటం లేదు.

- Advertisement -

మనోభావాలు దెబ్బతిన్నాయా?

“హనుమాన్” థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సమయంలోనే “మంకీ మ్యాన్” ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఈ హాలీవుడ్ మూవీకి ఇండియాలో ముఖ్యంగా తెలుగు స్టేట్స్, మన దేశంలో కూడా మంచి హైప్ వచ్చింది. “హనుమాన్” మూవీలా ఇది కూడా భక్తితో కూడిన సూపర్ హీరో మూవీ అనుకున్నారు. నిజానికి హనుమాన్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి “మంకీ మ్యాన్” మేకర్స్ ఆ సమయంలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వాళ్ల ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ సినిమాపై డివోషనల్ ఒపీనియన్ వచ్చేసింది ఇండియన్ ప్రేక్షకులకు. ఇప్పుడేమో “మంకీ మ్యాన్” ట్రైలర్ 2తో బీభత్సమైన వైలెన్స్, అసభ్యకర సన్నివేశాలు చూపిస్తూ అసలు కథను రివీల్ చేశారు. ఈ ట్రైలర్ ద్వారా ఈ మూవీకి హనుమాన్ మూవీతో ఏ రకంగానూ పోలిక ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అక్కడక్కడ హనుమంతుడి రిఫరెన్స్ ను మాత్రం వాడుకున్నారు. మొత్తానికి “మంకీ మ్యాన్” ట్రైలర్ అదిరిపోయింది. కానీ ఆ అసభ్యకరమైన సీన్స్, ఆల్కహాల్ వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే, “మంకీ మ్యాన్”లో మరేదో చూపిస్తున్నారు. ఇది మనవాళ్లకు డైజెస్ట్ అవ్వదు. మరి దీనికి మూల్యం ఎలా ఉండబోతోంది అంటే “మంకీ మ్యాన్” థియేటర్లలోకి వస్తేనే గాని తెలియదు. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు