Tollywood : మెగా హీరోల గుడ్ టైం స్టార్ట్ అయినట్టేనా?

మెగా హీరోలకు బ్రో మూవీ నుంచి కంటిన్యూగా బ్యాడ్ టైం నడుస్తోంది. చిరు నుంచి మొదలుకొని వైష్ణవ్ తేజ్ దాకా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరి ఇంతకీ మెగా హీరోల బ్యాడ్ టైం గుడ్ టైంగా మారేదెప్పుడు? ఈ బ్యాడ్ టైంకు ఫుల్ స్టాప్ పెట్టబోయే మెగా హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే….

మెగా హీరోలు అందరూ కష్టాల్లోనే…

మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ ప్లాఫ్ నుంచి మెగా హీరోలను బ్యాడ్ లక్ వెంటాడుతోంది. ఆ తర్వాత వచ్చిన మెగా సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఆయన నటించిన భోళా శంకర్ మూవీ అట్టర్ ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ హీరోగా చేసిన గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు కనీసం రిలీజ్ అయ్యాయి అన్న విషయం కూడా సినీ ప్రియులకు పెద్దగా తెలియదు. ఆయన నెక్స్ట్ మూవీ మట్కా బడ్జెట్ కష్టాలను ఎదుర్కొంటూ నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటుంది. సాయి దుర్గ తేజ్ నటిస్తున్న “గంజా శంకర్” ఆగిపోయింది అనేది ఇన్సైడ్ టాక్. మరోవైపు రాంచరణ్ నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ రోజురోజుకు లేట్ అవుతూనే ఉంది. 2023లోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ పొలిటికల్ కారణాల వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

- Advertisement -

అంతా పవన్ చేతుల్లోనే ఉందా?

2023 మొదట్లో మెగా హీరోలకు అన్నీ గుడ్ న్యూస్ లే అందాయి. వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్, సాయి దుర్గ తేజ్ విరూపాక్ష హిట్, ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డ్, బన్నీకి నేషనల్ అవార్డు, రామ్ చరణ్ కు కూతురు పుట్టడం. కానీ “బ్రో” థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తలకిందులైంది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోంది మెగా హీరోల విషయంలో. మరి ఈ బ్యాడ్ టైంను గుడ్ టైంగా మార్చే హీరో ఎవరు? అంటే అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న మూడు అప్డేట్స్ రాబోతున్నాయి. ఇదే మెగా అభిమానులకు ఈ ఏడాది రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేసి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ఫ్యాన్స్ కు. కాబట్టి బ్రో మూవీతో బ్యాడ్ టైం తెచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు “ఉస్తాద్” అప్డేట్ తో మళ్ళీ గుడ్ టైంను మొదలుపెట్టినట్టుగా అయ్యింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోంది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసి, నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు. అలాగే సుకుమార్ కాంబోలో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. చివరగా మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు