Good Bad Ugly : రేటు పెంచేసిన అజిత్… కొత్త మూవీకి షాకింగ్ రెమ్యూనరేషన్

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే కొత్త మూవీని తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ కోసం అజిత్ పారితోషికం కూడా అదే రేంజ్ లో తీసుకోబోతున్నారట. ఇప్పటికే భారీ పారితోషికం అందుకుంటున్న కోలీవుడ్ హీరోల లిస్ట్ లో ఉన్న అజిత్, కొత్త మూవీకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తో ఫ్యాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో స్థానం దక్కించుకోబోతున్నారు. మరి ఇంతకీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి అజిత్ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయంలోకి వెళ్తే….

పారితోషకం పెంచేసిన అజిత్…

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం “గుడ్ బ్యాడ్ అగ్లీ”. తమిళ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇది అజిత్ కెరీర్ లో 61వ మూవీ. ప్రస్తుతం చేస్తున్న “విదా ముయార్చి” అనే మూవీ ని పూర్తి చేశాక నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు ఈ హీరో. మరో 40 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతోంది. వచ్చే ఏడాది జూన్ లో “గుడ్ బ్యాడ్ అగ్లీ” రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వినూత్నమైన కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీకి అజిత్ తీసుకుంటున్న పారితోషికం షాకింగ్ గా మారింది. ఈ మూవీ కోసం అజిత్ ఏకంగా 163 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు సమాచారం.

- Advertisement -

ఇప్పుడు అజిత్ రెమ్యూనరేషన్ ఎంత?

ప్రస్తుతం అజిత్  తీసుకుంటున్న పారితోషికం కంటే మరో 50 కోట్ల కంటే ఎక్కువే అందుకోబోతున్నాడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం. ప్రస్తుతం అజిత్ 105 కోట్లు పారితోషకంగా అందుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్. మొత్తానికి “గుడ్ బ్యాడ్ అగ్లీ” మూవీతో కోలీవుడ్ లోనే 150 కోట్లకు పైగా పారితోషికాన్ని అందుకుంటున్న స్టార్స్ జాబితాలో అజిత్ చేరిపోతున్నాడు.

150 కోట్లు అందుకున్న కోలీవుడ్ స్టార్స్…

ఇప్పటిదాకా కోలీవుడ్ ఇండస్ట్రీలో 150 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న స్టార్స్ లిస్ట్ లో విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రమే ఉన్నారు. విజయ్ ఒక్కో సినిమాకు 150 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు. అయితే తన తాజా మూవీ “గోట్”కు మాత్రం మరో 50 కోట్లు కలిపి 200 కోట్లు తీసుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. అలాగే ఆయన చివరి మూవీకి 250 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న “ఇండియన్ 2” మూవీకి 150 కోట్లు వసూలు చేస్తున్నట్టు టాక్. మరోవైపు రజినీకాంత్ రెమ్యూనరేషన్ ఇప్పటికే 250 కోట్లు దాటినట్టు రూమర్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు అజిత్ కేవలం బైలింగ్వల్ మూవీ “గుడ్ బ్యాడ్ అగ్లీ”కి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తో 150 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న పాన్ ఇండియా స్టార్స్ కు పోటీగా నిలిచారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు