Shriya Reddy : ఈ “సలార్” బ్యూటీకి పవన్ తెలియదట… ఇదెక్కడి మాస్ కామెడీ గురూ!!

శ్రియా రెడ్డి… ప్రస్తుతం ఈ పేరు మార్మోగిపోతోంది. దాదాపు దశాబ్దం తర్వాత వెండితెర పైకి రీఎంట్రీ ఇచ్చిన శ్రియా రెడ్డికి “సలార్” మూవీతో సాలిడ్ హిట్టు పడింది. ఈ సినిమాలో శ్రియా రాధా రమా అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. “సలార్” మూవీలో పృథ్వీరాజ్ సోదరిగా జీవించేసింది. ఆమె హీరోయిన్ కాకపోయినప్పటికీ హీరోయిన్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. విమర్శకులు సైతం శ్రియా రెడ్డి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్యూటీ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.

ఇక ఆ ఇంటర్వ్యూలో శ్రియా మాట్లాడుతూ “సలార్” మూవీ తన కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిందని, సుమారు దశాబ్దం తర్వాత తాను నటించిన ఈ సినిమా తనకు కెరీర్ లోనే మర్చిపోలేని గుర్తింపును తెచ్చి పెట్టిందని మురిసిపోయింది. ఈ సందర్భంగా తాను నటించబోయే నెక్స్ట్ మూవీ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “ఓజి”లో ఈ బ్యూటీ కీలక పాత్రలో కనిపించబోతుందట. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందనీ, అయితే ఈ ఈ మూవీలో నటించే వరకు తాను పవన్ కళ్యాణ్ పేరును పెద్దగా వినలేదు అనీ, ఆయన అంత పెద్ద స్టార్ అనే విషయం కూడా తెలియదు అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

కానీ “ఓజీ”లో తాను కీలక పాత్రలో నటిస్తున్నాను అని తెలియడంతో ఎక్కడికి వెళ్లినా పవన్ అభిమానులు తనను గొప్పగా చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ తనను ఆశ్చర్యపరిచిందని, సెట్ లో ఎప్పుడు కలిసినా పవన్ చక్కగా మాట్లాడతాడని, ఆయన ఒక మంచి మనిషి అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన క్యారెక్టర్ కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించింది. ఈ సినిమాలో శ్రియ నెగటివ్ రోల్ చేస్తోందట. ఆమె క్యారెక్టర్ పలు విభిన్నమైన షేడ్స్ లో ఉంటుందని, ఈ సినిమా రిలీజ్ కోసం తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పింది.

- Advertisement -

అయితే ఆమె పవన్ తెలీదు అంటూ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఓవర్ నైట్ స్టార్ అయితే కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో అంతకన్నా కాదు. ఇక పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇతర సినిమా ఇండస్ట్రీలలో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కానీ శ్రియ రెడ్డి మాత్రం అసలు తనకు పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అని తెలీదు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అసలు ఇదెక్కడి మాస్ కామెడీ గురూ అంటూ శ్రియ రెడ్డి కామెంట్స్ పై సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక “ఓజి” మూవీ విషయానికి వస్తే ముంబై” జపాన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథాంశంతో అత్యంత ప్రతిసాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన విషయం తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు