Thammudu : అడవి బ్యాక్ డ్రాప్.. పది రోజులకే 8 కోట్లట…

Thammudu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన నితిన్ ఇప్పుడు కసి మీదున్నాడు. వరుస పరాజయాలతో మీడియం రేంజ్ హీరోల్లో చాలా డౌన్ అయ్యాడు. నిజం చెప్పాలంటే ఎనిమిదేళ్ల కింద వచ్చిన అఆ సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదని చెప్పాలి. మధ్యలో భీష్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అందుకే ఆ హిట్ దర్శకుడితోనే మళ్ళీ చేయి కలిపాడు. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో “రాబిన్ హుడ్” మూవీ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత కొన్నాళ్లుగా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా నితిన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో “తమ్ముడు” అనే పేరుతోనూ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. వకీల్ సాబ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా శరవేగంగా జరుగుతుంది.

తమ్ముడికి అక్కగా లయ..

ఇక నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ “లయ” నితిన్ కి అక్కగా నటిస్తోంది. ఆమె పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంటుందంట. నితిన్ కెరియర్ లో తమ్ముడు ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. ఇక సెంటిమెంట్ గా పవన్ కళ్యాణ్ టైటిల్ నే పెట్టుకున్న నితిన్ కి మరోసారి పీకే ఫ్యాన్స్ ఆదరణ ఈ సినిమాకి దక్కే ఛాన్స్ ఉంది. ఇక గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఇక కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

అడవి బ్యాక్ డ్రాప్ లో భారీ ఫైట్..

ఇదిలా ఉండగా తమ్ముడు సినిమా కొత్త షెడ్యూల్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారు. ఇక ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని 10 రోజుల పాటు ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారట. అంతే కాదు ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్ లో మొత్తం 50 మంది ఫైటర్స్ పాల్గొంటారట. ఇక ఈ సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే మాట చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది. నితిన్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో దిల్ రాజు “తమ్ముడు” సినిమాని నిర్మిస్తున్నారు. ఇక దిల్ తో దిల్ రాజు కి కెరియర్ లో బెస్ట్ మూవీ ఇచ్చిన నితిన్, ఆ తరువాత శ్రీనివాస కళ్యాణం మూవీతో ఫ్లాప్ అందుకున్నారు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. మూవీ ఫస్ట్ లుక్ తోనే తమ్ముడు చిత్రంపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది. ఇక వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి, అలాగే దిల్ రాజుకి తమ్ముడు సినిమా తో మంచి కం బ్యాక్ హిట్ వస్తుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు