Samantha: అతడిపై మనసు పారేసుకుంటున్న సమంత.. ప్రేమ మొత్తం నీకే అంటూ..!

Samantha.. ప్రముఖ హీరోయిన్ సమంత గత ఏడాది నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సీరీస్ కి సంబంధించిన టైటిల్ ని కూడా మేకర్స్ ప్రకటించారు.. హనీ బన్నీ అని టైటిల్ పెట్టినట్టుగా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే .. ఇక ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.. ఇదిలా ఉండగా తాజాగా సమంత చేసిన ఒక మెసేజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.. మాజీ భర్తను పూర్తిగా వదిలేసింది అనే వార్తలు ఈ మెసేజ్ తో తేటతెల్లమవుతున్నాయి..

Samantha:Samantha is throwing her heart on him.. she says all her love is for you..!
Samantha:Samantha is throwing her heart on him.. she says all her love is for you..!

అతడిపై మనసు పారేసుకుంటున్న సమంత..

ఇదిలా ఉండగా సమంత నటిస్తున్న హనీ బన్నీ వెబ్ సిరీస్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.. దీంతో వరుణ్ ధావన్ కు సమంతా చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా వరుణ్ ధావన్ చేసే ప్రతి పోస్ట్ కి కూడా ఈమె రియాక్ట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య బాండ్ ఇప్పుడు మరింత బలం అయినట్లు సమాచారం.. తాజాగా బుధవారం వరుణ్ ధావన్ పుట్టినరోజు కావడంతో అతడికి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపింది ఈ ముద్దుగుమ్మ ..అంతేకాదు వరుణ్ ధావన్ తో కలిసి ఫుడ్ తింటున్న ఫోటోని షేర్ చేస్తూ.. “సెండింగ్ యు లాట్స్ ఆఫ్ లవ్ మై డియర్ ఫ్రెండ్ ఏడాది నీకు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.. నా ప్రేమ మొత్తం నీకే” అంటూ తెలిపింది.. ఇందుకు సంబంధించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

సమంత కెరీర్..

సమంత విషయానికి వస్తే .. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది ..ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ వంటి హీరోలకు కూడా అవకాశం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యను నాలుగు సంవత్సరాల తర్వాత దూరం పెట్టేసింది.. విడాకులు తీసుకొని ఇద్దరు ఎవరిదారి వారు చూసుకున్నారు. అంతే కాదు రెండు సంవత్సరాల క్రితం మయోసైటిస్ అనే వ్యాధి బారిన కూడా పడింది. ప్రస్తుతం ఆ వ్యాధి చికిత్స తీసుకుంటూ ఏడాది పాటు సినిమాలకు విరామం ఇచ్చిన ఈమె ఇప్పుడు సిటాడెల్ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలో ప్రకటిస్తూ అటు సౌత్ ఇండియా ఇటు నార్త్ ఇండియాను చుట్టేస్తోంది సమంత. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన వెకేషన్ కి సంబంధించిన ప్రతి ఫోటోని, వీడియోని అభిమానులతో పంచుకుంటుంది. అలాగే హాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు