Tillu Square : థియేట్రికల్ రైట్స్ కంటే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎక్కువ..

Tillu Square : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరిస్తూ అదిరిపోయే కలెక్షన్లతో అదరగొడుతున్నాడు. టిల్లు స్క్వేర్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి అదరగొడితే, టిల్లు స్క్వేర్ మాత్రం ఫస్ట్ పార్ట్ హైప్ తోనే రిలీజ్ అయింది. ఇక టిల్లు గాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో రచ్చ చేసాడో తెలిసిందే. తన డీజే సౌండ్ తో థియేటర్లను హోరెత్తిస్తున్నాడు. ఇక సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు సిద్ధుయే కథని అందించగా ఈ సీక్వెల్ ని దర్శకుడు మల్లిక్ రామ్ అద్భుతంగా తీసాడు. లాజిక్ ల గురించి పక్కన పెడితే టిల్లు గాడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇప్పటివరకు టిల్లు స్క్వేర్ థియేటర్ల దగ్గర దాదాపు 68 కోట్ల షేర్ తో రచ్చ చేయగా 123 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి, ఇప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

నాన్ థియేట్రికల్ బిజినెస్ లో రచ్చ..

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన టిల్లు స్క్వేర్ (Tillu Square) ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండగా, ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 122 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊహకందని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నైజాంలో అయితే పెద్ద సినిమాల రేంజ్ లో పాతిక కోట్లకి పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ చరిత్రలో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా సంచలనం సృష్టించిన ఈ సినిమా మేకర్స్ కి లాభాల పంట పండించిందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ మీద భారీ లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా సెన్సేషనల్ రేటుని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. ఓవరాల్ గా అన్ని భాషల డిజిటల్ అండ్ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ తో కలిపి ఈ సినిమాకి అక్షరాలా 32 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందట.

థియేట్రికల్ కంటే ఎక్కువ..

ఇక టిల్లు స్క్వేర్ సినిమా కి జరిగిన నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిన థియేట్రికల్ బిజినెస్ కంటే ఎక్కువ అని చెప్పాలి. టిల్లు స్క్వేర్ కి అన్ని చోట్ల కలిపి 28 కోట్ల బిజినెస్ జరగగా, ఇప్పుడు దీన్ని మించి థియేట్రికల్ బిజినెస్ 32 కోట్లకు పైగా అంటే, 5 కోట్లు ఎక్కువగానే జరగడం విశేషం. ఇక డిజే టిల్లు అల్టిమేట్ హిట్ అడ్వాంటేజ్, ఈ సినిమాకి లభించగా ఏమాత్రం తీసిపోని విధంగా పార్ట్ 2 కూడా ఉండటమే కాదు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడంతో, ఈ రేంజ్ లో రేటు సినిమాకి సొంతం అయ్యిందని సమాచారం. ఇక పార్ట్ 2 సక్సెస్ తర్వాత పార్ట్ 3 గా టిల్లు క్యూబ్ ని కూడా అనౌన్స్ చేయగా, ఆ పార్ట్ కి కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ అలాగే థియేటర్స్ లో కూడా కలెక్షన్స్ కంటెంట్ బాగుంటే అదరగొట్టే ఛాన్స్ ఉంది. క టిల్లు స్క్వేర్ వల్ల సిద్ధూ తర్వాతి సినిమా జాక్ కి కూడా సాలిడ్ బిజినెస్ జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు