Kalki 2898AD : రాయలసీమ లో సాలిడ్ బిజినెస్ ఆఫర్!

Kalki 2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD సినిమా కోసం ఐడియా వైడ్ గా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంత ఎదురు చుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కల్కి నుండి వచ్చే ఒక్కో అప్డేట్ ఒక్కో విధంగా హైప్ పెంచుతూ కిక్కెస్తున్నాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాంటి ఊరమాస్ మూవీ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD) సమ్మర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమా కోసం థియేటర్ డిస్ట్రిబ్యూటర్స్ నుండి, బయ్యర్ల దాకా ఎగబడిపోతున్నారు. నిజానికి ఈ పాటికి థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ జరిగి లెక్కలు మే నెలలో రిలీజ్ అవ్వాల్సింది, కానీ ఎలక్షన్స్ వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యి జూన్ ఎండ్ టైంకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక కల్కి సినిమా కి ఆల్రెడీ సెన్సేషనల్ బజ్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండగా, అన్ని ఏరియాల నుండి కూడా బిజినెస్ ఆఫర్స్ మరో లెవల్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

సైన్స్ ఫిక్షన్ సినిమాకి మాస్ ఆఫర్స్..

ఇకపోతే కల్కి2898AD సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ టచ్ ఆక్షన్ డ్రామా కాబట్టి, ఈ సినిమాను ఎలా చూపించబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో వారి మహావిష్ణువు కల్కి అవతారంగా కనిపిస్తుండగా, అమితాబ్ బచ్చన్ మహాభారత వీరుడు అశ్వద్ధామ గా కనిపిస్తున్నాడని ఈ మధ్యే రివీల్ చేసారు. మరి కమల్ హాసన్ ని ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా హైప్ కి తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో కల్కి కి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా నైజాం లో 100 కోట్లు ఇప్పటికిపుడు ఇవ్వడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు రెడీ గా ఉన్నాయి. కానీ రిలీజ్ టైం నాటికి అంతకు మించి కూడా జరిగే అవకాశం ఉంది. అయితే నైజాం రైట్స్ మాక్జిమం మైత్రి వారు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మిగతా ఏరియాల్లో కూడా కల్కి కి భారీ ఆఫర్లు వస్తున్నాయట.

సీడెడ్ లో కళ్ళు చెదిరే ఆఫర్లు..

ఇక కల్కి 2898AD సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా, ఇతర మాస్ మూవీస్ తో పోల్చితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటాయో తేలాల్సి ఉండగా, టాలీవుడ్ లో మాస్ మూవీస్ కి భారీగా బ్రహ్మరధం పట్టే రాయలసీమ ఏరియా నుండి కూడా ఈ సినిమాకి ఊహకందని రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయట. ఏకంగా 26-30 కోట్ల మధ్యలో సినిమాకి ఇక్కడ డిమాండ్ వస్తుందట. ఈ రేంజ్ అంటే బాహుబలి RRR రేంజ్ లో సినిమా మెప్పించాల్సి ఉంటుందేమో. పైగా సలార్ తో పోల్చితే కంప్లీట్ గా డిఫరెంట్ & ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ మూవీ గా తెరకెక్కుతున్న కల్కి మూవీకి రిలీజ్ టైం నాటికీ, సీడెడ్ బిజినెస్ 30 కోట్ల లెక్కలు దాటొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక కల్కి(Kalki 2898AD) మూవీ యొక్క ట్రైలర్ ఇంకా రిలీజ్ డేట్ ని కంఫర్మ్ చేస్తే దాన్ని బట్టి అంచనాలతో పాటు బిజినెస్ కూడా తారాస్థాయికి వెళ్లే ఛాన్స్ ఉంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు