Family Star OTT Release Date : ఫ్యామిలీ స్టార్ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే?

Family Star OTT Release Date : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. థియేటర్లలో ప్లాప్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అనుకున్న దాని కంటే వారం ముందుగానే ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

ఇంత త్వరగా ఓటిటిలోకి…

హిట్ కోసం పరితపిస్తున్న విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో డిజాస్టర్ పడింది ఫ్యామిలీ స్టార్ మూవీతో. ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలిన ఈ మూవీని మూడు వారాల్లోనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీ రైట్స్ ను ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా, మూవీ థియేటర్లోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి తీసుకొస్తుండడం విశేషం. ఏప్రిల్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.

రెమ్యూనరేషన్ తిరిగి చేసిన విజయ్ దేవరకొండ…

డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాగా, ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. నిర్మాత దిల్ రాజు స్వయంగా మైక్ పట్టుకుని ఆడియన్స్ దగ్గర ఒపీనియన్  తీసుకున్నప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక ఈ మూవీ వల్ల దిల్ రాజు తీవ్రమైన నష్టాలను చవి చూశాడని సమాచారం. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం 15 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడని రూమర్లు వచ్చాయి.

- Advertisement -

ఓటీటీలో అయిన సక్సెస్ అవుతాడా?

అవుట్ డేటెడ్ స్టోరీతో డైరెక్టర్ థియేటర్లలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు అనే విమర్శలు వచ్చాయి. మొత్తానికి థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ మూవీకి ఓటీటిలో ఎంత వరకు ప్రేక్షకు ఆదరణ లభిస్తుందో చూడాలి. బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన సినిమాలెన్నో ఓటీటీలో మాత్రం దూసుకెళ్లాయి. మరి ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా అదే జరుగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

vd12పైనే విజయ్ ఆశలన్నీ

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ ను పక్కన పెట్టేసి నెక్స్ట్ మూవీపై ఫోకస్ చేశారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపైనే ఆశాలన్నీ పెట్టుకున్నాడు ఈ రౌడీ హీరో. వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్న విజయ్ కు ఈ మూవీ అయినా హిట్ టాక్ తో ఊరటనిస్తుందా? అనేది చూడాలి.

ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టు..

రీసెంట్ గా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంట్లో కన్పించారు. దీంతో వీరిద్దరూ కలిసి స్టోరీ డిస్కషన్ చేశారనే రూమర్లు వచ్చాయి. కేజిఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, విజయ్ కాంబోలో ప్రాజెక్టు ఎప్పుడు వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు