Monkey Man On OTT : చప్పుడు కాకుండా ఓటిటీలో అడుగు పెట్టిన మంకీ మ్యాన్… మనకు మాత్రం నో ఛాన్స్

Monkey Man On OTT : తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ దేవ్ పటేల్ హీరోగా నటించిన ఈ మూవీ తాజాగా చడీ చప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీని ఇండియన్ మూవీ లవర్స్ చూసే అవకాశం మాత్రం లేదు. మరి మంకీ మ్యాన్ మేకర్స్ ఎందుకు ఇలా చేశారు? అంటే…

ఈ దేశాల్లోని ఆడియన్స్ కే ఛాన్స్

మంకీ మ్యాన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు హీరో దేవ్ పటేల్. ఇందులో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటించగా, ఈ మూవీ ఇప్పటికే విదేశాల్లో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ 5న అమెరికాలోని థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అక్కడ రిలీజ్ అయిన 20 రోజుల గ్యాప్ లోనే ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కావడం గమనార్హం. అయితే కేవలం ఓటీటీలో అమెరికా, కెనడా లాంటి దేశాల్లోని మూవీ లవర్స్ మాత్రమే ఈ మూవీని చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మూవీ ఇంకా సెన్సార్ సమస్యల కారణంగా ఇండియాలో రిలీజ్ కాలేదు.

ఇదే అసలు సమస్య…

భారతీయ పురాణాల స్ఫూర్తితో దేవ్ పటేల్ మంకీ మాన్ మూవీ తెరకెక్కింది. ఇందులో చాలా మంది భారతీయ నటీనటులే నటించారు. ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ల వేశ్యగా బోల్డ్ రోల్ చేసి అందరిని అట్రాక్ట్ చేసింది. కానీ హనుమన్ ను స్ఫూర్తిగా తీసుకొని మంకీ మ్యాన్ ను తెరకెక్కించిన నేపథ్యంలో ఇందులో ఉన్న పలు వైలెంట్ యాక్షన్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల పట్ల ఇండియన్ మూవీ లవర్స్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెన్సార్ ఈ మూవీ థియేటర్లలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది. కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ కట్స్ కూడా చెప్పింది. కానీ మేకర్స్ నుంచి ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ బయటకు రాలేదు.

- Advertisement -

డైరెక్ట్ గా ఓటీటీలోనే రాబోతోందా?

ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ మూవీ సెన్సార్ ఇబ్బందులను దాటుకొని తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని ప్రచారం సాగింది. కానీ తాజాగా ఓటీటీ లోకి మంకీ మ్యాన్ రావడంతో ఇండియాలో కూడా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. మంకీ మ్యాన్ మూవీ రైట్స్ ను ఇండియాలో నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా, మే ఫస్ట్ వీక్ లో ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీ లోకి రాబోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే. కానీ ఒకవేళ ఇదే నిజమైతే మంకీ మ్యాన్ మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని అనుకునే వారికి నిరాశ తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు