Aavesham on OTT : ఫహాద్ ఫాజిల్ ఆవేశం ఓటిటిలోకి ఎప్పుడంటే?

Aavesham on OTT : మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆవేశం రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఫహాద్ కెరీర్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన ఫస్ట్ మూవీగా నిలిచింది ఈ చిత్రం. ఇప్పటికే మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్ లైఫ్, భ్రమయుగం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ గోల్డెన్ టైంను చూస్తోంది. ఈ నేపథ్యంలోనే రిలీజ్ అయిన ఆవేశం మూవీ కూడా భారీ కలెక్షన్లు కొల్లగొట్టి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద హాయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీ కూడా ఆవేశం కావడం విశేషం. సమంత లాంటి సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్న ఈ హిట్ మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటిలోకి రాబోతోంది అనే ప్రచారం మొదలైంది. మరి ఇంతకీ ఆవేశం ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది? అంటే…

ముందుగానే ఓటీటీలోకి..

అమెజాన్ ప్రైమ్ వీడియో ఆవేశం మూవీ ఓటిటి రైట్స్ ను సొంతం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో ఇంకా సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీ మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ మొదలైంది. మే సెకండ్ వీక్ లో ఆవేశం మూవీ ఓటిటి రిలీజ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని, ఓకే ఓటీటీలో మలయాళంతో పాటు మిగిలిన భాషలైన తెలుగు, హిందీ తమిళ కన్నడలో కూడా స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.

స్టోరీ లోకి వెళ్తే…

గ్యాంగ్ స్టర్ కథకు మదర్ సెంటిమెంట్, కామెడీని జోడించి దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన స్టోరీ లైన్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలో ఫహద్ ఫాజిల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయి అనే టాక్ నడుస్తోంది. శాంతన్, బీబీ, అజు ఇంజనీరింగ్ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ ఈ ముగ్గురు ర్యాగింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో లోకల్ గ్యాంగ్ స్టర్ రంగారావు అలియాస్ రంగా హెల్ప్ తో ఈ ముగ్గురు తమ సీనియర్లపై పగ తీర్చుకుంటారు. ఆ తర్వాత ఈ ముగ్గురు రంగా గ్యాంగ్ లో చేరడంతో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? తమకు హెల్ప్ చేసిన రంగానే వాళ్ళు ఎందుకు చంపాలి అనుకున్నారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -

ఫహాద్ కు కాసుల వర్షం..

ఆవేశం మూవీలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించడంతోపాటు సినిమాను నిర్మించారు కూడా. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఊహించని విధంగా బడ్జెట్ కంటే ఐదు రెట్లు ఎక్కువగానే వసూళ్లు రాబట్టింది. ఈ సినిమానే కాదు ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిన్న మూవీ ప్రేమలు కూడా ఫ్రెండ్స్ తో కలిసి నిర్మించారు ఫహాద్ ఫాజిల్. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు కూడా ఫహాద్ కు బాగా కలిసి వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు