Manjummel Boys on OTT : మంజుమ్మెల్ బాయ్స్ ఓటిటి రిలీజ్ పై అప్డేట్… సస్పెన్స్ కంటిన్యూస్

Manjummel Boys on OTT : మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది సంచలనం సృష్టించిన సినిమాల్లో మంజుమ్మెల్ బాయ్స్ కూడా ఒకటి. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన తొలి మలయాళ మూవీగా చరిత్రను సృష్టించిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజ్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. ఆ తర్వాత ఏప్రిల్ 6న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ ఓటిటీ రిలీజ్ విషయంలో ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే తాజా అప్డేట్ ను వెల్లడించారు మేకర్స్.

ఒకే ఓటీటీలో ఐదు భాషల్లో…

తాజాగా ఈ మూవీ రైట్స్ ను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంమ్మెల్ బాయ్స్ మూవీ గురించి ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీని ఒకే ఓటిటి ప్లాట్ఫామ్ అంటే హాట్ స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్న విషయాన్ని తాజా పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ఓటిటి రిలీజ్ ఆలస్యం కాగా, ఇన్ని రోజుల తరువాత కూడా త్వరలో అంటూ ఊరిస్తోంది హాట్ స్టార్.

ఆలస్యానికి ఇదే కారణమా?

మంజుమ్మెల్ బాయ్స్ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఈ మూవీ లాంగ్ రన్ ఉండడంతో ఓటీటీలోకి రావడానికి ఆలస్యం అవుతుందని సమాచారం. అందుకే హాట్ స్టార్ ఈ మూవీ అప్డేట్స్ ఇస్తూ త్వరలో త్వరలో అంటూ ఊరిస్తోంది తప్ప, క్లారిటీగా రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. కానీ ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మంజుమ్మెల్ బాయ్స్ మూవీ మే 3 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది అని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఈ ఓటిటి సంస్థ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి డైరెక్టర్ చిదంబరం దర్శకత్వం వహించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ బసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పడవల్, దీపక్ పరంబోల్, లాల్ జూనియర్, కరుణ్ కురియన్, అభిరామ్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుశీన్ శ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మంజుమ్మెల్ బాయ్స్ మూవీని సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ అంటోనీ నిర్మించారు. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 235 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తెలుగులో హిట్ గా నిలిచిన ఈ మూవీని ఓటీటీలో చూడడానికి మలయాళం నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి దీనిపై అఫిషియల్ గా ప్రకటిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు