Samantha: వారి తాటతీస్తా..సమంత వార్నింగ్‌ !

Samantha Warns Media About Fake News: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అని ఎవరైనా అడిగితే వెంటనే సమంత పేరు చెబుతారు. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సమాంత అంటే బాగా ఇష్టం. ఎక్కడ చూసినా సమంత సమంత… అంటూ ఉంటారు ఫ్యాన్స్. దాదాపు 14 సంవత్సరాల పై టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్గా కాకుండా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు సమంత.

అలాంటి సమంత గురించి ఎంత చెప్పినా తప్పుగా అవుతుంది. గత 14 సంవత్సరాల కిందట ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. తన మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ సినిమానే ఏ మాయ చేసావే. ఏ మాయ చేసావే సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన సమంత హీరోయిన్గా నటించింది. 14 సంవత్సరాల కిందట వచ్చిన ఈ ఏ మాయ చేసావే సినిమా బంపర్ హిట్ అందుకుంది.

దీంతో అక్కినేని నాగచైతన్య మరియు సమంత కెరీర్ పూర్తిగా మారిపోయింది. అంతేకాదు ఇదే సినిమా సమయంలో నాగచైతన్య మరియు సమంత ప్రేమలో పడ్డ సంగతి మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చెట్ట పట్టాలు వేసుకొని లైఫ్ ఎంజాయ్ చేశారు అక్కినేని నాగచైతన్య మరియు సమంత. అలా ఐదు సంవత్సరాల పాటు లవర్స్ గా తిరిగారు. ఆ తర్వాత విషయం అక్కినేని నాగచైతన్య తండ్రి అయిన నాగార్జునకు తెలిసింది. దీంతో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం చేపించారు అక్కినేని నాగార్జున.

- Advertisement -

2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం జరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ ఇద్దరు కలిసి ఉన్నారు. వీరి వివాహ బంధంలో ఎలాంటి సమస్యలు రాలేదు. కానీ నాలుగు సంవత్సరాల తర్వాత అంటే డిసెంబర్ 2021 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్నారు. దీంతో సమంత కెరీర్ అక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

Samantha Warns Media About Fake News

భర్తను వదిలిపెట్టిందని కొంతమంది సోషల్ మీడియాలో టార్చర్ కూడా పెట్టారు. సమంత తప్పిదం వల్ల విడాకుల విషయం తన పైకి వచ్చిందని అంటున్నారు. దానికి తోడు హీరోయిన్ సమంతకు మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చింది. ఈ వ్యాధితో గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది సమంత. అమెరికా మరియు రష్యా ఇలా అనేక దేశాలు తిరిగి ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే అయినప్పటికీ సమంత పై కొంతమంది దారుణంగా వార్తలు రాస్తున్నారు.

ఈ వార్తలు రాయడంపై తాజాగా హీరోయిన్ సమంత స్పందించింది. తనకు వ్యతిరేకంగా, తప్పుడు ప్రచారం చేస్తే తాటతీస్తానని హెచ్చరించింది సమంత. అనవసరంగా తన జీవితాన్ని బయటకు తీస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు