Filmify Exclusive Prasanth Varma New Movie : బాబోయ్ ఏకంగా రణ్‌వీర్ సింగ్‌తో… జాక్ పాట్ కొట్టేసిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma New Movie : హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ఏంటో అందరికీ తెలిసింది. ఈ సినిమా తర్వాత ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు గానీ, హీరోలు గానీ ప్రశాంత్ వర్మతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారని చాలా మంది అంచనా వేశారు. ఈ అంచనాలు అన్నీ కూడా నిజం అవుతున్నాయి. హనుమాన్ కు సీక్వెల్‌గా రాబోతున్న జై హనుమాన్ మూవీలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటించడానికి రెడీ అవుతున్నారనే టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ నుంచి రాబోతున్న సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోగా చేయబోతున్నాడట. ఆ హీరో ఎవరు…? దాని వెనక ఉన్న కథ ఏంటంటే..

జై హనుమాన్ హోల్డ్…

హనుమాన్ హిట్ అయిన తర్వాత అందరి చూపు ప్రశాంత్ వర్మ పై పడ్డాయి. దీనికి కారణం హనుమాన్ కు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ పై బజ్ అని చెప్పొచ్చు. అయితే అందరినీ షాక్ కు గురి చేసే విషయం ఏంటంటే.. ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకు జై హనుమాన్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయలేదట. దానికి ఇంకా టైం పట్టేలా ఉందట. అ లోపు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. నిజానికి జై హనుమాన్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా జై హనుమాన్ బిగిన్స్ అంటూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. జై హనుమాన్ బిగిన్స్ అంటే… ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అని తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి జై హనుమాన్ వచ్చే ఛాన్స్ ఏ మాత్రం లేదని సమాచారం.

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో…

జై హనుమాన్ స్క్రీప్ట్ రెడీ చేయడం, షూటింగ్ చేయడం.. ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే జై హనుమాన్ కి ముందు కనీసం రెండు సినిమాలు చేయాలని ప్రశాంత్ వర్మ అనుకున్నారట. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ ఓ స్టోరీ తీసుకుని బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ ను కలిసిరట. హనుమాన్ హిట్ అయిన నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ కూడా పెద్దగా ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనిపై త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా రాబోతుందని Filmify కి ఎక్స్‌క్లూజివ్ గా సమాచారం వచ్చింది. షూటింగ్ కూడా చాలా స్పీడ్ చేయడానికి ప్రశాంత్ వర్మ ఉన్నారట.

- Advertisement -

అనుపమతో కూడా ఓ మూవీ…

అంతే కాదు, ప్రశాంత్ వర్మ ( Prasanth Varma New Movie ) జై హనుమాన్ కి ముందు మరో సినిమా చేస్తున్నాడు. అదే అనుపమ పరమేశ్వరన్ తో. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయిన వెంటనే డైరెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అప్పుడే రణ్ వీర్ సింగ్ తో చేయబోయే మూవీకి కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో ఛాన్స్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు