Anjali: ఆ తమిళ హీరో చేతిలో మోసపోయిన అంజలి ?

Tollywood Start Heroin Anjali cheated by that Tamil hero: టాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది ఇతర రాష్ట్రాల వారు ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కొంతమంది మాత్రమే తెలుగు హీరోయిన్లు ఉంటారు మనం టాలీవుడ్ ఇండస్ట్రీలో..! హలో తెలుగు హీరోయిన్లలో అంజలి ఒకరు. హీరోయిన్ అంజలి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ… ఈ బ్యూటీ చాలా అందంగా ఉంటుంది. 37 సంవత్సరాలు ఉన్న ఈ బ్యూటీ… ఓవైపు హీరోయిన్ గా అలాగే ఐటెం సాంగ్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

అంతేకాకుండా సైడ్ పాత్రలలో, మెయిన్ హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. 2006 సంవత్సరంలో ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టింది హీరోయిన్ అంజలి. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఇక ఈ తరుణంలోని విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. అయితే ఇందులో విక్టరీ వెంకటేష్ సరసన అంజలిని ఫిక్స్ చేశారు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో అంజలికి వరుసగా ఛాన్సులు వచ్చాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అలాగే ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ సినిమాలో కీలకపాత్ర చేసింది హీరోయిన్ అంజలి. అంతేకాకుండా బలుపు, మసాలా అలాగే గీతాంజలి లాంటి సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.

- Advertisement -
Tollywood Start Heroin Anjali cheated by that Tamil hero
Tollywood Start Heroin Anjali cheated by that Tamil hero

ముఖ్యంగా 2014 సంవత్సరంలో అంజలి నటించిన కామెడీ హారర్ సినిమా గీతాంజలి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తోంది. మొన్ననే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక హీరోయిన్ అంజలి పర్సనల్ విషయానికి వస్తే… ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ గడుపుతోంది ఈ బ్యూటీ. 37 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తుంది. తన కెరీర్ పై దృష్టి పెట్టేందుకు… పెళ్లి చేసుకోవడం లేదని అప్పట్లో చెప్పింది హీరోయిన్ అంజలి.

ఈ తరుణంలోనే హీరోయిన్ అంజలి గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోయిన్ అంజలి తమిళ స్టార్ హీరో ను ప్రేమించిందట. ఆ హీరో ఎవరో కాదు తమిళ హీరో జై. జై అలాగే అంజలి… ఇద్దరు తమిళ ఇండస్ట్రీలో బాగా పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ చివరికి బేధాభిప్రాయాలు వచ్చాయంట. దీంతో అంజలి మరియు జై విడిపోయారని సమాచారం. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే.. హీరోయిన్‌ అంజలి చాలా మంచి అమ్మాయి అని.. అలాంటి పనులు చేయాలేదని కొంత మంది అంటున్నారు. మొత్తానికి జై, అంజలి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు