Samantha: నాగ చైతన్యపై సమంత షాకింగ్ పోస్ట్ ?

Samantha’s shocking post on Akkineni Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అవుతున్న హీరోయిన్లలో అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి, ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకరు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని రికార్డులు, అలాగే ఎవరు చేయలేని సినిమాలు చేసింది సమంత.

అప్పట్లో సౌందర్య తర్వాత అంతటి స్థాయిని సంపాదించుకోగలిగింది హీరోయిన్ సమంత. దాదాపు 14 సంవత్సరాల కిందట టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. అడుగుపెట్టగానే ఏం మాయ చేసావే సినిమాతో బంపర్ హిట్ అందుతుంది. వాస్తవానికి తమిళ ఇండస్ట్రీలో మొదట సినిమాలు చేసి ఆ తర్వాత మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ సమంత. అడుగుపెట్టగానే ఏం మాయ చేసావే సినిమా ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేయగా… సమంత హీరోయిన్గా చేసింది.

Tollywood heroine Samantha's shocking post on Akkineni Naga Chaitanya
Tollywood heroine Samantha’s shocking post on Akkineni Naga Chaitanya

ఈ సినిమా బంపర్ హిట్ అయినట్లే.. సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత ప్రేమించుకున్నారు. వీరిద్దరూ దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకుని.. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలోనే సమంత మరియు నాగచైతన్య పెళ్లి జరిగింది. 2017 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత వివాహం జరిగింది. అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.

- Advertisement -

ఈ దరిద్రమైన సంఘటన 2021 డిసెంబర్లో జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడివిడి గానే ఉంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ.. కాలం గడిపిస్తున్నారు ఈ ఇద్దరు స్టార్లు. అయితే తాజాగా హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ అక్కినేని నాగచైతన్యను ఉద్దేశించి సమంత పోస్ట్ చేసినట్టు కొంతమంది అంటున్నారు.

నువ్వు లేకుండా నేనేం చేయగలను అంటూ సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నువ్వు అంటే అక్కినేని నాగచైతన్యాను అని అనుకుంటున్నారు సమంత ఫ్యాన్స్. దీంతో త్వరలోనే అక్కినేని నాగచైతన్య మరియు సమంత కలవబోతున్నారని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అందరూ హ్యాపీగా ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాగా,అక్కినేని నాగచైతన్య కూడా ఇచ్చిన తర్వాత సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి మయోసైటిస్ అనే వ్యాధితో సమంత పోరాటం చేస్తూనే ఉంది. ఇదే సమయంలో సమంత చేసిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. యశోద అలాగే ఖుషి సినిమా తప్ప అన్ని సినిమాలు శెడ్డుకు వెళ్లాయి. ఇక ఈ నేపథ్యంలోనే రెండు సంవత్సరాల కిందట పుష్పలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది సమంత. ఎంత బాధ ఉన్నా కూడా తన జీవితాన్ని ముందుకు సాగిస్తోంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు