Heroine Laya: త్వరలో రీయంట్రీ… ఆ రూమర్స్ కి చెక్..!

Heroine Laya.. అందాల తెలుగమ్మాయి ప్రముఖ హీరోయిన్ లయ ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. అందానికి తగ్గ అందం, అభినయంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది.. హీరో అర్జున్, జగపతిబాబు కలిసి నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాతో మరింత లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత స్టార్ హీరోలు, కుర్ర హీరోలకు అవకాశాలు ఇస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకుంది.. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయిపోయిన లయ.. తనకంటూ ఒక డాన్స్ స్కూల్ ని కూడా మొదలుపెట్టి లైఫ్ లీడ్ చేస్తోంది.. అంతేకాదు కరోనా తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కూడా పనిచేసి నెలకు రూ.30 లక్షల వరకు సంపాదించింది.

Heroine Laya:Re-entry soon... Check those rumours..!
Heroine Laya:Re-entry soon… Check those rumours..!

రూమర్ పై క్లారిటీ.

ఇకపోతే సినిమాలకు దూరమైనా సరే సోషల్ మీడియా లో బిజీగా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ కి సిద్ధమైన విషయం తెలిసిందే. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాతో రీ యంట్రీ ఇస్తోంది లయ.. ఇక అందులో భాగంగానే తాజాగా ఇండియాకు వచ్చిన ఈమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తనపై వచ్చిన రూమర్స్ అలాగే తన రీ యంట్రి గురించి కూడా క్లారిటీ ఇచ్చింది.. ఇకపోతే సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఫేక్ రూమర్స్ కి కూడా క్లారిటీ ఇచ్చింది..

రీ ఎంట్రీ కి సిద్ధం..

ఇక అందులో భాగంగానే లయ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఇప్పటివరకు నా గురించి పెద్దగా గాసిప్స్ రాలేదు.. హీరోయిన్లు చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటే విడాకులు తీసుకోవడం.. భర్తను వదిలేసాక అడుక్కుతింటూ ఉండటం.. వల్ల మళ్లీ సినిమాలు చేస్తున్నారు అని అందరూ అనుకుంటారు.. అయితే నేనేమీ అడుక్కొని తినడం లేదు.. నాకు విడాకులు కాలేదు.. అప్పుడు అంటే పిల్లలు చిన్న వాళ్ళు కావడం వల్ల సినిమాలలో నటించడం కుదరలేదు.. ప్రస్తుతం వారు పెద్దవాళ్లయ్యారు.. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు.. నేను లేకపోయినా ఉండగలుగుతారు .. అందుకే ఇప్పుడు ఇండియాకి వచ్చి సినిమాలు చేద్దామనుకుంటున్నాను ..అందులో భాగంగానే నితిన్ నటిస్తున్న సినిమాలో నాకు అవకాశం లభించింది .. ప్రస్తుతం నేనేమి అడుక్కుని తినడం లేదు.. భర్తను పర్మిషన్ అడిగి నటించడానికి వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం లయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

- Advertisement -

లయ కెరియర్ :

లయ సినీ ఇండస్ట్రీకి రాకముందు జాతీయస్థాయి చదరంగం క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. నాలుగవ తరగతి లోనే మొదటి సినిమాలో నటించే అవకాశం వచ్చింది .. అయితే ఆ సినిమా విడుదల అవ్వకపోవడం వల్లే ఎక్కువ మందికి చేరలేకపోయింది.. తరువాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరిలో ఉండగా స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా ఎంపికై 1999లో విడుదలైన ఈ సినిమా ఈమెకు హీరోయిన్గా మంచి పేరును అందించింది.. తర్వాత ప్రేమించు, మనసున్న మారాజు ఇలా పలు చిత్రాలలో నటించి చివరిగా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించి ఇండస్ట్రీకి దూరమైంది ..ఇప్పుడు మళ్లీ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు