Jio Cinema OTT: కేవలం ఒక్క రూపాయికే 4K మూవీస్..!!

Jio Cinema OTT.. జియో నెట్వర్క్ వచ్చిన తర్వాత టెలికామ్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా 5G నెట్వర్క్ ని అందిస్తూ.. టెలికాం రంగంలోనే టాప్ లో దూసుకుపోతోంది. అలాగే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని కూడా మొదలుపెట్టి సత్తా చాటుతోంది.. ఎక్కువగా ఐపీఎల్ ఇందులోనే వీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా ఓటీటీ సినిమా లవర్స్ కి కూడా కొత్త సినిమాలను ఇందులో విడుదల చేస్తూ ఉన్నారు.. సబ్స్క్రైబర్స్ కోసం సరికొత్త ఆఫర్లను కూడా తీసుకువచ్చింది జియో టెలికాం సంస్థ.

Jio Cinema OTT: 4K Movies for just one rupee..!!
Jio Cinema OTT: 4K Movies for just one rupee..!!

జియో సినిమా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ధరలను కూడా ప్రకటించింది.. కొత్తగా తీసుకువచ్చిన వాటిలో రూ.29, రూ.89 రూపాయల ప్లాన్లు ఉన్నవి.. 29 రూపాయల ప్లాన్ రోజుకి రూ .1చొప్పున నెలకి 29 రూపాయలు చెల్లిస్తే నెల మొత్తం వీక్షించే ఆఫర్ ను తీసుకువచ్చింది జియో సంస్థ. అయితే ఈ సబ్స్క్రిప్షన్ కేవలం ఒక్క డివైజ్ కి మాత్రమే వర్తిస్తుందట. ఒకవేళ రూ .89 రూపాయల ప్లాన్ ని రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే నాలుగు డివైస్లకు ఉపయోగించుకోవచ్చు. వీడియో క్వాలిటీ పెంచడం, యాడ్స్ లేకుండా ఉండడమే ఈ ప్లాన్ ల యొక్క ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు.

రూ.29 ప్లాన్:

కేవలం రోజుకి ఒక్క రూపాయి చొప్పున నెలకు 29 రూపాయలు చెల్లిస్తే చాలు ఎటువంటి యాడ్స్ లేకుండా ఫోర్ కే క్వాలిటీతో కూడా ఇందులో మనం వీడియోలను, సినిమాలను వీక్షించవచ్చు. అంతేకాకుండా డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ని కూడా జియో సంస్థ కస్టమర్ల కోసం ఉంచింది. జియో సినిమా యాప్ లో వచ్చేటువంటి కంటెంట్ ని మొత్తం మొబైల్ లేదా టీవీలో ఏదైనా ఒక్క డివైస్ లో మాత్రమే వీక్షించవచ్చు. గతంలో ఈ ప్లాన్ ధర 59 రూపాయలు ఉండగా ఇప్పుడు తగ్గించేసింది.

- Advertisement -

రూ.89 ప్లాన్:

ఈ ప్లాన్ ని ఫ్యామిలీ ప్లాన్ కింద తీసుకువచ్చింది జియో టెలికాం సంస్థ.. ఈ రూ.89 ప్లాన్ ని ఒకసారి రీఛార్జ్ చేస్తే నాలుగు డివైస్లలో నెల మొత్తం ఉపయోగించుకోవచ్చు. పైన చెప్పిన రూ.29 ప్లాన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో వర్తిస్తాయట.. గతంలో ఈ ప్లాన్ 149 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 89 రూపాయలకే కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ కింద ప్రకటించింది జియో టెలికాం సంస్థ.

సబ్స్క్రైబర్లే మొదటి లక్ష్యం..

ఇప్పటికే జియో సినిమాను సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారు ఆటోమేటిక్గా ఈ ప్లాన్ లోకి అప్గ్రేడ్ అవుతారని కూడా తెలియజేస్తుంది. ఈ రెండు ఆఫర్ల ద్వారా మరింత సబ్స్క్రైబర్ లను పెంచుకునే పనిలో పడ్డది జియో సినిమా.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడం చేత ఎక్కువగా జియో సినిమాలోనే ఐపీఎల్ చాలామంది వీక్షిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మరింత పాపులర్ అయితే మిగతా ఓటిటి ప్లాట్ఫామ్లకు కచ్చితంగా దెబ్బ పడుతుంది అని చెప్పవచ్చు. మరి చూద్దాం జియో ఆలోచన ఉపయోగపడుతుందో..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు