Top Trending movies on Prime Video : ప్రైమ్ లో దుమ్ము రేపుతున్న సినిమాలు ఇవే… తెలుగు మూవీనే స్పెషల్

Top Trending movies on Prime Video : అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఉన్న టాప్ 10 సినిమాలలో తెలుగు సినిమాదే హవా నడుస్తుండడం విశేషం. థియేటర్లలో రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ మూవీ ఓటిటిలో దుమ్ము రేపుతోంది. ఓటిటీలోకి వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ టాప్ ట్రెండింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మూవీస్ జాబితాలో ఈ మూవీ రెండవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మరి ఇంతకీ ప్రస్తుతం ఇండియాలో ప్రైమ్ మీడియాలో టాప్ 10 లో రన్నింగ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేద్దాం.

ఓం భీమ్ బుష్ మాయ…

శ్రీ విష్ణు, ప్రియ దర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన హారర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్. మార్చ్ 22న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పెద్దగా లాజిక్ లేకపోయినా ఆ కామెడీని ప్రేక్షకులు థియేటర్లలో బాగానే ఎంజాయ్ చేశారు. ఇక ఏప్రిల్ 20 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ అప్పటి నుంచి ఇప్పటి దాకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండవ స్థానంలో నిలవడం గమనం. మొదటి రోజు నుంచి కూడా ఇదే స్థానంలో ఫ్రెండ్ అవుతోంది ఈ మూవీ. ఓం భీమ్ బుష్ మూవీతో పాటే మరో తెలుగు కామెడీ మూవీ చారి 111 కూడా టాప్ ట్రెండింగ్ లో 9వ స్థానం దక్కించుకోవడం మరో విశేషం. ఈ మూవీలో వెన్నెల కిషోర్ హీరోగా నటించారు.

ఇక ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల లిస్ట్ విషయానికి వస్తే…. తేరి బాతోమే ఐసా ఉల్టా జియా అనే హిందీ మూవీ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుంది. 2వ స్థానంలో ఓం భీమ్ బుష్, 3వ స్థానంలో జే బేబీ అనేది తమిళ డ్రామా, 4వ స్థానంలో అంచక్కల్లకొక్కన్ అనే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్, 5వ స్థానంలో జోరం అనే హిందీ సర్వైవల్ థ్రిల్లర్ ఉన్నాయి.

- Advertisement -

6వ స్థానంలో రణం అనే తమిళ మూవీ, 7వ స్థానంలో యాత్ర 2 అనే తెలుగు పొలిటికల్ డ్రామా, 8వ స్థానంలో చార్లీ 777 అనే కన్నడ మూవీ, టాప్ 9లో చారి 111 అనే తెలుగు కామెడీ మూవీ, టాప్ 10 లో ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ మజిల్ ఉన్నాయి.

టాప్ 10 ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ ల లిస్ట్

ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచరస్ సిరీస్ ఫాలౌట్, హారర్ సస్పెన్స్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషి, ఇంగ్షీషు కామెడీ సిరీస్ యంగ్ షెల్డన్, కొరియన్ కామెడీ డ్రామా మ్యారి మై హస్బెండ్, హిందీ సస్పెన్స్ సిరీస్ ఫర్జీ, హిందీ క్రైం థ్రిల్లర్ మీర్జాపూర్, హిందీ కామెడీ డ్రామా పంచాయత్, హిందీ యాక్షన్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్, హిందీ యాక్షన్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్, హిందీ సస్పెన్స్ డ్రామా పోచర్ టాప్ 10లో ట్రెండింగ్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు